Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టిటిడి పాలకమండలిలోకి ఉపరాష్ట్రపతి కుమార్తె దీపా వెంకట్...

శనివారం, 25 నవంబరు 2017 (17:09 IST)

Widgets Magazine
Tirumala

దాదాపు ఆరు నెలలుగా ఎదురుచూస్తున్న టిటిడి నూతన పాలకమండలి నియామక ప్రకటన ఈ వారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన పాలకమండలిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, సామాజిక సేవకురాలు దీప వెంకట్‌కు స్థానం లభించనుందని సమాచారం. అదేవిధంగా పీలేరుకు చెందిన చల్లాబాబుకు చోటు లభించనుంది. 
 
తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి సిఫార్సుతో చల్లా బాబుకు బోర్డులో స్థానం కల్పిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా పాతబోర్డులోని సినీ నిర్మాత, దర్శకుడు రాఘవేంద్రరావుకు మరోసారి పాలకమండలిలో అవకాశం దక్కనుంది. 
 
అయితే గత రెండు నెలల వరకు కూడా వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ పేరు వినబడకపోయినా తాజాగా ముఖ్యమంత్రి స్వయంగా అనుకుని మరీ ఆమెకు ఈ పదవి ఇవ్వనున్నారట. ఇదే విషయాన్ని వెంకయ్యనాయుడు దృష్టికి చంద్రబాబు కూడా తీసుకెళ్ళారట. టిటిడి బోర్డు సభ్యురాలిగా ఉండటం దీపా వెంకట్‌కు కూడా ఇష్టమేనంటున్నారు. శ్రీవారి చెంత ఉండటం ఎంతో మంచిదన్న ఆలోచన ఆమెది. అందుకే చంద్రబాబు చెప్పగానే దీప ఒకే అనేశారట. అయితే టిటిడి ఛైర్మన్ ఎవరన్నది మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

'డోల్ భాజే' పాట‌కు మానుషి నృత్యం.. వీడియో వైరల్

విశ్వసుందరిగా ఎన్నికైన భారతీయ సుందరాంగి మానుషీ చిల్లర్‌కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ ...

news

33 వేల మందిని మింగేసిన సముద్రం.. ఎక్కడ?

భూమండలంపై ఉన్న సముద్రాల్లో మధ్యదరాసముద్రం ఒకటి. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ సముద్రం ఏకంగా ...

news

భార్యతో పలుకుతున్నాడనీ నగ్నంగా చెట్టుకు కట్టేసి చనిపోయేదాకా కొట్టారు...

కర్ణాటక రాష్ట్రంలోని యద్గిరి జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఓ యువకుడు తన భార్యతో వివాహేతర ...

news

హఫీజ్‌ విడుదలపై అమెరికా ఆందోళన... పాక్‌కు వార్నింగ్

ముంబై పేలుళ్ల సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌‌‌కు పాకిస్థాన్ స్వేచ్ఛ ...

Widgets Magazine