శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 28 అక్టోబరు 2016 (16:30 IST)

'జై పాతాళ భైరవి' అనగానే అమరావతి నగరం ఊడిపడదు... వెంకయ్య నాయుడు

జై పాతాళ భైరవి అనగానే అమరావతి నగరం ఊడిపడదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పరిపాలనా నగరానికి శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ఆనాడు పార్లమెంటు తలుపులు వేసి, దూరదర్శన్

జై పాతాళ భైరవి అనగానే అమరావతి నగరం ఊడిపడదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పరిపాలనా నగరానికి శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ఆనాడు పార్లమెంటు తలుపులు వేసి, దూరదర్శన్ బటన్ ఆపి ఏపీ విభజనను అడ్డగోలుగా చేశారు. ఆరోజు ఆంధ్రకు అన్యాయం జరుగుతుందని మాట్లాడింది నేనే. 
 
రాజ్యసభలో నేను మాట్లాడేందుకు ఎక్కువ సమయాన్ని నాకు కేటాయించింది అరుణ్ జైట్లీగారే. ఇవాళ ఆయన ఆర్థిక మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన నిధులు కేటాయిస్తున్నారు. ప్రత్యేక హోదాకు మించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం ద్వారా ఏపీని మరింత అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
 
అమరావతి నగరం పూర్తి స్థాయిలో ఏర్పడేందుకు కాస్త టైం పడుతుందనీ, ఇందుకోసం రైతులు భూమిలిచ్చి దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. ఐతే అమరావతి నగరం అభివృద్ధికి చిన్న చిన్న సమస్యలున్నాయనీ, జై పాతాళ భైరవి అనగానే నగరం ఏర్పడదనీ, దానికి టైం పడుతుంద'ని చెప్పారు.