మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 31 జనవరి 2017 (04:19 IST)

ఎప్పుడు ప్రకటించామన్నది కాదయ్యా పవన్.. ఇచ్చామో లేదో చూడవేం.. వెంకయ్య బుసబుస..!

ఒకరేమో సినిమాల్లో పంచ్ డైలాగుల కింగ్. మరొకరేమో రాజకీయాల్లో తిరుగులేని పంచ్ డైలాగుల కింగ్. వీళ్లిద్దరికి జగడం మొదలైతే ఆ కిక్కే వేరప్పా లాగా ఉంటుంది మరి. ఇప్పుడు ఏపీలో ఈ ఇద్దరి డైలాగులు బీభత్సంగా పేలుతున్నాయి. వాళ్లెవరో కాదని ఇప్పటికే అర్థమై ఉంటుంది.

ఒకరేమో సినిమాల్లో పంచ్ డైలాగుల కింగ్. మరొకరేమో రాజకీయాల్లో తిరుగులేని పంచ్ డైలాగుల కింగ్. వీళ్లిద్దరికి జగడం మొదలైతే ఆ కిక్కే వేరప్పా లాగా ఉంటుంది మరి. ఇప్పుడు ఏపీలో ఈ  ఇద్దరి డైలాగులు బీభత్సంగా పేలుతున్నాయి. వాళ్లెవరో కాదని ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఒకరు వపనయ్య, మరొకరు వెంకయ్య. ఏ క్షణంలో వీరిద్దరికీ జగడం మొదలయిందో కానీ అప్పటినుంచి పంచ్ లు కౌంటర్ పంచ్‌లు పేలుతున్నాయి. ఈ ఇద్దరి మధ్య తాజా పంచ్ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మీదే మరి.
 
జనవరి 26న ఏపీలో ప్రత్యేక హోదా ర్యాలీ సందర్భంగా జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఇటు రాష్ట్రంలో అధికార టీడీపీపే ఒక రేంజిలో డైలాగుల యుద్ధం ఆడేశారు. కాటమ రాయుడు షూటింగుకు ఏ ఇబ్బంది కలగకుండానే విరామ సమయాల్లో పవన్ పేల్చిన పంచ్‌లు ఈ ఇరుపార్టీల వారికీ ఇప్పటికే ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి. ఆ రోజునుంచ ఏపీలో టీడీపీ వర్గాలు పవన్‌ను ఆటాడేసుకున్నాయి. నీకేం తెలుసురా హోదా గురించి, ప్యాకేజీ గురించి అనే రేంజిలో పవన్‌ని తిట్టేశారు. 
 
ఇప్పుడు బీజేపీ తరపున వెంకయ్య వంతొచ్చింది.  ప్రత్యేక ప్యాకేజీపై అర్ధరాత్రి ఎందుకు ప్రకటన చేశారన్న పవన్ వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు కౌంటరిచ్చారు. ప్రజలు నిద్రపోయినా 24 గంటలు పాలన కొనసాగిస్తున్నామన్నారు. ప్రకటన ఎప్పుడు చేశామన్నది అసలు సమస్య కాదని చెప్పారు. 
 
పోలవరానికి వంద శాతం నిధులివ్వడం, ప్రాజెక్టులకు సంబంధించిన బడ్జట్‌పై సీఎం చంద్రబాబుతో చర్చించామని, ఆ తర్వాత ఆయన కొత్త సూచనలు చేశారని తెలిపారు. ప్యాకేజీపై ఆర్థిక మంత్రితో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ప్రకటించామని వివరించారు. 
 
ఉత్తరాది, దక్షిణాది అంటూ జనాన్ని రెచ్చగొట్టడం సరికాదని పవన్‌కు వెంకయ్య చురకలంటించారు. బారతదేశమంతా ఒక్కటేనని, కానీ కొందరు సంకుచిత మనస్థత్వంతో ఆలోచిస్తున్నారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సారాలు గడిచిన ఇంకా ఉత్తరాది, దక్షిణాదని ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదని పవన్‌కల్యాణ్ ఉద్దేశించి వెంకయ్యనాయుడు ఘాటు సమాధానమిచ్చారు.
 
ఇదంతా బాగానే ఉంది. కానీ ఈసారి పవన్ కౌంటర్ పంచ్‌లు ఎప్పుడు మొదలెడతాడన్నదే ప్రశ్న. రాజకీయాలు ఎలా తయారయ్యాయో కదా..