శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2015 (16:27 IST)

యువతిపై యేడాదిగా అత్యాచారం... వీడియో తీసి స్నేహితులకు చూపించాడు.. ఎక్కడ?

తమ ఇంట్లో అద్దెకు దిగిన యువతిని లోబరుచుకుని ఒక యేడాదికాలంగా అత్యాచారం చేస్తూ వచ్చిన యువకుడు... తమ శారీరక సంబంధాన్ని రహస్యంగా వీడియో తీసి తన స్నేహితులకు చూపించాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో నిందితులంతా పరారయ్యారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
విజయవాడ నగరంలోని రామవరప్పాడులో ఒక కుటుంబం ఓ ఇంట్లో అద్దెకు దిగింది. ఈ కుటుంబంలో 24 యేళ్ల యువతి ఉంది. అలాగే, ఇంటి యజమానికి రాఘవేంద్ర అనే కుమారుడు ఉన్నాడు. ఈ యువకుడు ఆ యువతిపై కన్నేశాడు. ఆ తర్వాత ఆ యువతిని మాటలతో మాయచేసి..  యేడాది కాలంగా శారీరకంగా కలుస్తూ వచ్చాడు.
 
తమ కలయికను రహస్యంగా వీడియో తీసి... తన స్నేహితులకు చూపిస్తూ వచ్చాడు. ఒక రోజున ఆ స్నేహితులు ఈ వీడియో క్లిప్పింగ్స్‌ను తమ ఫోన్లలో ఎక్కించుకుని, ఆయువతిని బెదిరించ సాగారు. తమకు కూడా శారీరక సుఖం పంచాలని, డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న నిందితులు పరారయ్యారు.