శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 4 మే 2016 (15:42 IST)

మండలప్రజాపరిషత్ కార్యాలయం వద్ద కాలు మెలికేసిన 'గుంటూర్ టాకీస్'... పీకుతున్న పోలీసులు(ఫోటోలు)

పోలీసులంటే... ఏం చెయ్యాలి? శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించాలి... దొంగ‌త‌నాల‌ను అరిక‌ట్టాలి. ప్ర‌జ‌ల మాన‌, ప్రాణాల‌కు ర‌క్షణ క‌ల్పించాలి. అంత‌కు మించి... జ‌ర‌గ‌బోయే అన‌ర్థాల‌ను ముందే ఊహించి, అవి జ‌ర‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవ‌డంలోనే పోలీసుల గొ

పోలీసులంటే... ఏం చెయ్యాలి? శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించాలి... దొంగ‌త‌నాల‌ను అరిక‌ట్టాలి. ప్ర‌జ‌ల మాన‌, ప్రాణాల‌కు ర‌క్షణ క‌ల్పించాలి. అంత‌కు మించి... జ‌ర‌గ‌బోయే అన‌ర్థాల‌ను ముందే ఊహించి, అవి జ‌ర‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవ‌డంలోనే పోలీసుల గొప్ప‌త‌నం ఉంది. దానిని నిజ‌మైన పోలీసింగ్ అంటారు. కానీ, ఏపీ పోలీసులు... అవ‌న్నీ మ‌న‌కెందుకులే అనుకున్నారేమో! చ‌క్క‌గా సినిమా వాల్‌పోస్ట‌ర్ల‌పై ప‌డ్డారు. 
 
విజ‌య‌వాడ న‌గ‌రంలోని రోడ్ల‌పై గోడ‌ల‌పై పోస్టర్ల‌ను చించేశారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల గోడ‌ల‌పై అతికించిన పోస్ట‌ర్ల‌ను, అలాగే ట్రాఫిక్ డివైడ‌ర్ల వ‌ద్ద త‌గిలించిన పోస్ట‌ర్ల‌ను తొల‌గించారు. మాచ‌వ‌రంలో మున్సిప‌ల్ అధికారుల‌తో క‌లిసి పోస్ట‌ర్ల క్యాంపెయిన్ నిర్వ‌హించారు. బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌పై అశ్లీల పోస్ట‌ర్లు, ప్ర‌క‌ట‌న‌లు వేయ‌డం 1997 సెక్ష‌న్ 4ఆర్ బై డ‌బ్ల‌యూ 15 ప్ర‌కారం నేర‌మ‌ని పోలీసు అధికారులు ప్ర‌క‌టించారు. 
 
కానీ, ప‌ని లేని పోలీసులు పోస్ట‌ర్లు పీకుతున్నార‌ని కొందరు ప్ర‌జ‌లు కిసుక్కుమంటున్నారు. ఆ ప‌నేదో మున్సిప‌ల్ కార్మికుల‌తో చేయించి, వారు కేసులు పెట్టుకుంటే బాగుండేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.