1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (11:02 IST)

కాలి గాయానికి చికిత్స చేయమని ఆస్పత్రికెళితే... కాటికి పంపిన వైద్యులు.. ఎక్కడ?

కాలి గాయానికి చికిత్స చేయమని ఆస్పత్రికి వెళితే వైద్యులు ఏకంగా కాటికే పంపించేశారు. ఈ దారుణం విశాఖపట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌కు చెందిన గన్నారపు శివప్రస

కాలి గాయానికి చికిత్స చేయమని ఆస్పత్రికి వెళితే వైద్యులు ఏకంగా కాటికే పంపించేశారు. ఈ దారుణం విశాఖపట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌కు చెందిన గన్నారపు శివప్రసాద్‌ (35) ఈపీడీసీఎల్‌ పరిధిలోని పాడేరు డివిజన్‌లో సబ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు నెలల క్రితం శివప్రసాద్‌ శబరిమలైలో కొండ మీదకు వెళుతుండగా కాలి బొటనవేలికి ఏదో గుచ్చుకొని గాయమైంది.
 
మందులు వాడినా తగ్గకపోవడంతో వైద్యులకు చూపించగా చిన్నపాటి శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరగా మరుసటిరోజు సాయంత్రం కాలి వేలికి శస్త్రచికిత్స చేశారు. రూంకు తరలించిన అనంతరం శివప్రసాద్‌ అందరితో బాగానే మాట్లాడారు. 
 
రాత్రి సుమారు 10.30 గంటలకు నొప్పి తగ్గేందుకు, గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకంటూ ఆస్పత్రి సిబ్బంది ఇంజక్షన్లు చేశారు. తర్వాత కొద్ది నిమిషాలకే శివప్రసాద్‌ నురగలు కక్కుకుంటూ కిందపడిపోగా... వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు. కొద్దిసేపటికే శివప్రసాద్‌ మృతిచెందినట్టు కుటుంబ సభ్యులకు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శివప్రసాద్ చనిపోయారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.