శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (10:59 IST)

మహిళ కంటిలో 14 పురుగులు.. కంటి నుంచి వెలికితీత

ఉత్తర అమెరికా, దక్షిణ కెనడాలోని పశువుల కళ్లల్లో బతికే అరుదైన పురుగులను అమెరికా మహిళ కంట్లో నుంచి వెలికి తీశారు. దిలాజియా గులోసా అనే 14 పురుగులను వైద్యులు ఓరెగాన్‌కు చెందిన ఓ మహిళ (26) కళ్లలో గుర్తించి

ఉత్తర అమెరికా, దక్షిణ కెనడాలోని పశువుల కళ్లల్లో బతికే అరుదైన పురుగులను అమెరికా మహిళ కంట్లో నుంచి వెలికి తీశారు. దిలాజియా గులోసా అనే 14 పురుగులను వైద్యులు ఓరెగాన్‌కు చెందిన ఓ మహిళ (26) కళ్లలో గుర్తించి... వాటిని వెలికి తీశారు. ఒక్కోటి అర అంగుళం పొడవుండే ఈ పురుగులు.. ఈగలు గబ్బిలాల ద్వారా సంక్రమిస్తాయని తెలుసునని వైద్యులు తెలిపారు. 
 
సదరు మహిళల చేపల వేటకు నదికి వెళ్ళిన సందర్భంలో ఈగ ద్వారా ఈ పురుగులు కంట్లోకి ప్రవేశించి వుంటాయని వైద్యులు చెప్తున్నారు. ఈ పురుగులు కంట్లో చేరిన మొదట్లో కన్ను మండుతుందని, దురద వస్తుందని.. ఈ కంప్లైంట్‌తోనే ఆమె ఆస్పత్రిలో చేరిందని వైద్యులు చెప్తున్నారు.