శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 27 జులై 2015 (07:58 IST)

నారాయణా... మీరు ఫోనెప్పుడు తీస్తారు.. మంత్రివర్యా..?.. ఎమ్మెల్యే వినతి.. ఎవరు?

అయ్యా... నారాయణ గారూ.. నేనో ఎమ్మెల్యేని. పైగా శాసనసభ పక్ష నేతను. మీరు నా ఫోనే తీయడం లేదు. ఇక సామాన్యులను ఏం పట్టించుకుంటారు స్వామీ.. అంటూనే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఓ ఎమ్మెల్యే తన ఆవేదనను మీడియా ఎదుట వెళ్ళగక్కారు. ఎవరా ఎమ్మెల్యే...?
 
విశాఖ జిల్లాకు చెందిన విష్ణుకుమార్ రాజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే.. ఆయన శాసనసభా పక్ష నేత కూడా ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి నారాయణ తీరును ఎండగట్టారు. ఆయనను ఫోన్లో మాట్లాడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నా దొరకడం లేదని వాపోయారు.
 
కొన్ని సమస్యలను వివరించడానికి తాను నారాయణ ఫోన్‌కు కాల్ చేస్తే తీయరు.. చివరకు పిఏలు, పిఎస్‌లకు ఫోన్ చేసినా తీసే పరిస్థితి లేదన్నారు. చివరకు గన‌మెన్‌లకు ఫోన్ చేసినా ఫలితం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ముఖ్యమంత్రి కంటే చాలా బిజీగా ఉండేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక తాము సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదన్నారు. తన పరిస్థితే ఇలా ఉంటే సామన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.