గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:18 IST)

విశాఖ టు ముంబై .... స్పైస్ జెట్ విమానం ప్రారంభం

విశాఖప‌ట్నం నుంచి ముంబైకి స్పైస్ జెట్ విమానం ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అధితిగా ఎమ్మెల్యే వాసుపల్లి హాజ‌ర‌య్యారు. ఈ రోజు విశాఖపట్నం విమానాశ్రయం ఆవరణలో స్పైస్ జెట్ విమానం విశాఖపట్నం నుండి ముంబై కు బ‌య‌లుదేరింది.

ముంబై వెళ్లే ఫ్లైట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అధితిగా హాజరైన విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, ఇది ఎంతో మంచి రోజు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం ను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయనున్నతరుణంలో ఈ విమానం ఎంతో ఉప‌యోగ‌క‌రం అన్నారు.

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలందరికీ చాలా తక్కువ రేటుకు ముంబై ఫ్ల‌యిట్ స‌ర్వీస్ అందుబాటు ధరలో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.