శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జులై 2016 (13:49 IST)

మీ మొగుడితో ఎలా ఉంటారో... నాతో కూడా అంత ఫ్రీగా ఉండాలి.. బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్!

పవిత్రమైన గురువు స్థానంలో ఉండే కొందరు కామాంధులుగా మారిపోతున్నారు. ఫలితంగా తమ వికృత చేష్టలతో విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.

పవిత్రమైన గురువు స్థానంలో ఉండే కొందరు కామాంధులుగా మారిపోతున్నారు. ఫలితంగా తమ వికృత చేష్టలతో విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ప్రభుత్వ బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. 
 
ఆ ప్రిన్సిపాల్ వేధింపులను తాళలోని పలువురు విద్యార్థినిలు ఏకంగా జిల్లా కలెక్టర్‌కు తమ గోడును ఓ లేఖ ద్వారా వినిపించుకున్నారు. ఆ లేఖలో వారికి ఎదురైన చేదు అనుభవాలను, ప్రిన్సిపాల్ వ్యవహారశైలిని వివరించారు. 
 
బాధిత విద్యార్థినిల్లో ఒకరు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాడని తెలిపింది. మీ మొగుడితో ఎలా ఉంటారో... తనతో కూడా అంత ఫ్రీగా ఉండండంటూ నీచంగా మాట్లాడేవాడని చెప్పింది. ప్రిన్సిపాల్ సహదేవుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.