శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: శనివారం, 27 ఆగస్టు 2016 (16:13 IST)

చంద్ర‌బాబు చెప్పిన‌ట్లు సింగ‌పూర్ స్వ‌ర్గ‌ధామం కాదు... దోచుకున్న‌ది దాచుకునే చోటు!

హైద‌రాబాద్ : సింగ‌పూర్‌తో ఆంధ్రప్ర‌దేశ్ చేసుకుంటున్న ఒప్పందాలు మ‌న దేశ చ‌ట్టాల‌కు విరుద్ధ‌మ‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఆ దేశం చాలా గొప్ప‌ద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పుకొస్తున్నారు గాని, సింగ‌పూర్ స్వ‌ర్గ‌ధామం కాదన్నారు.

హైద‌రాబాద్ : సింగ‌పూర్‌తో ఆంధ్రప్ర‌దేశ్ చేసుకుంటున్న ఒప్పందాలు మ‌న దేశ చ‌ట్టాల‌కు విరుద్ధ‌మ‌ని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఆ దేశం చాలా గొప్ప‌ద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పుకొస్తున్నారు గాని, సింగ‌పూర్ స్వ‌ర్గ‌ధామం కాదన్నారు. హైద‌ర‌బాదులో ఉండ‌వ‌ల్లి మీడియాతో మాట్లాడుతూ, ప్ర‌పంచంలో ఎక్క‌డ దొచుకున్న డ‌బ్బు అయినా, దాచుకోవడానికి సింగ‌పూర్ మంచి చోట‌న్నారు. 
 
అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి సీఎం చంద్ర‌బాబు పూర్తిగా సింగ‌పూర్ వంటి దేశాల‌పై ఆధార‌ప‌డ‌టం మంచిది కాద‌ని, ఇది దోపిడీకి దారి తీస్తుంద‌ని ఉండ‌వ‌ల్లి హెచ్చ‌రించారు. సింగ‌పూర్‌కి ఎంత డ‌బ్బు అయినా తీసుకెళ్లి దాచుకోవ‌చ్చ‌ని, ఆ సొమ్ము ఎక్క‌డిది అని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌ర‌ని చెప్పారు. ఇలాంటి సింగ‌పూర్‌ని చంద్ర‌బాబు ఎందుకు ఎంచుకున్నారో తెలియ‌ద‌ని ఉండ‌వ‌ల్లి ఎద్దేవా చేశారు.