Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియుడిపై మోజు.. భర్తపై కేసులు పెట్టిన భార్య.. తర్వాత ఏమైంది?

ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (16:24 IST)

Widgets Magazine
suicide

నిజానికి వారిద్దరి మతాలు వేరు. కానీ, ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు తమతమ కుటుంబ పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. కానీ, వివాహేతర సంబంధం ఆ దంపతుల మధ్య చిచ్చుపెట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న త‌న భార్య ఇత‌ర వ్య‌క్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంద‌ని తెలుసుకున్న ఆ భ‌ర్త ఆమెతో విడిపోయాడు. గ‌త ఏడాదికాలంగా వారిద్ద‌రూ వేర్వేరుగానే ఉంటున్నారు. అయితే, ఆ భ‌ర్త ఉన్న‌ట్టుండి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చిత్తూరు జిల్లాలోని మ‌ద‌న‌ప‌ల్లె ప‌రిధిలోని యనమలవారిపల్లెలో నివాసముంటున్న డేనియల్‌ కుమారుడు కె.స్వరాజ్‌కుమార్‌ (26) మదనపల్లెలో డిగ్రీ కోర్సు చదువుతున్న స‌మ‌యంలో అదే పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన‌ షేక్‌ హుస్సేన్, బషీరున్నీషా దంపతుల కుమార్తె యాస్మిన్‌తో పరిచయం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాలక్రమంలో ప్రేమగా మారి, నాలుగేళ్ల తర్వాత త‌మ‌ పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకుని, మూడేళ్ల పాటు హాయిగా జీవించారు.
 
ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ స్వ‌రాజ్ కుమార్ వ‌చ్చిన జీతంతో త‌న‌ భార్యతో ఆనందంగా గడుపుతున్నాడు. అయితే, భర్త అంగీకారంతో యాస్మిన్‌ మదనపల్లెలోని ఓ నర్సింగ్‌ హోమ్‌లో పనిచేస్తూ వస్తోంది. ఈ క్రమంలో అక్కడ పని చేసే శ్రీనివాసులుతో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆమె పుట్టింటికి వ‌చ్చేసింది. త‌న‌ తల్లిదండ్రులు, ప్రియుడి సాయంతో భర్త స్వరాజ్‌కుమార్‌పై పోలీస్ స్టేష‌న్‌లో కేసులు పెట్టింది. అయితే, వారి వేధింపులు తాళలేక భ‌ర్త‌ స్వరాజ్‌కుమార్ ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వాణిజ్య నౌకల కోసం.. ఏకమైన భారత్‌-చైనా బలగాలు

వాస్తవానికి భారత్, చైనాలు బద్ధ శత్రువులు. ఈ రెండు దేశాలు ఒక్క విషయంలో ఏకమయ్యాయి. అదే ...

news

హద్దుమీరితే అణుదాడికి వెనుకాడం.. అమెరికాకు ఉ.కొరియా హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక చేసింది. హద్దు మీరితే అణు దాడికి సైతం ...

news

కార్గోపై కేశినేని దృష్టి - కేశినేని ట్రావెల్స్‌ను ఎందుకు మూసేశారో తెలుసా..?

ఇన్నిరోజులు నష్టాల్లో లేనిది... ఇప్పుడు ఒక్కసారిగా వచ్చిందట. ఉన్నఫళంగా బోర్డు ఎత్తేసిన ...

news

బెండకాయ కూరేనా అంటూ భర్త వాగ్వివాదం.. పురుగుల మందు తాగేసిన వివాహిత

బెండకాయ కూర ఓ వివాహిత ప్రాణాలను బలితీసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో ...

Widgets Magazine