శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: సోమవారం, 6 జూన్ 2016 (21:55 IST)

సీటుకో టీవీ.. దానికో రిమోట్‌...వై ఫై ...ఎయిర్ బ‌స్సులో కాదు, ఎర్ర బ‌స్సులో....

విజయవాడ: దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఓ టీవీ ఏర్పాటు చేసి... దానిలో ఒకటో రెండో సినిమాలు వేస్తుండటం సర్వసాధారణం. ఈ మధ్య కాస్త ముందడుగు వేసిన కొన్ని ట్రావెల్‌ సంస్థలు బస్సుల్లో వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీనికి ముందడుగుగా బస్సులో సీటుకో టీవీ... ఇష్టమైన ఛానెల్‌ చూసేందుకు రిమోట్‌ సౌకర్యం కల్పిస్తే ఎలా ఉంటుంది. 
 
సీటుకో టీవీ.. దానికో రిమోట్‌...వైఫై...ఎయిర్ బ‌స్సులో కాదు...ఎర్ర బ‌స్సులోనే. ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది ఏపీఎస్‌ ఆర్టీసీ. ఆర్టీసీలో అత్యాధునిక లగ్జరీ బస్సులైన అమరావతి బస్సుల్లో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి సీటు వెనకాల టీవీ ఏర్పాటు చేసి మనకు నచ్చిన ఛానెల్‌ చూసేందుకు రిమోట్‌ కూడా ఇస్తున్నారు. ఈ సౌకర్యాన్ని 80 అమరావతి బస్సుల్లో సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. దీనిని విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఇది రవాణా రంగంలో సరికొత్త ప్రయోగమని ఆర్టీసీ అధికాలు చెబుతున్నారు.