శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (00:52 IST)

ప్రపంచంలో మేమే నెంబర్ 1, శంషాబాద్‌కు రండి మేం చూసుకుంటాం!

ప్రపంచంలోనే తాము నెంబర్ వన్ పారిశ్రామిక విధానం తీసుకువస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం వేములలో కోజెంట్ గ్లాస్ కంపెనీని ప్రారంభించిన సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ... వచ్చే రెండేళ్లలో కోజెంట్ సంస్థ నెంబర్ వన్ సంస్థ అవుతుందని జోస్యం చెప్పారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... పరిశ్రమలను నెలకొల్పేందుకు తెలంగాణకు వచ్చే వ్యాపారవేత్తలకు అనువైన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామన్నారు. వారి రాకను తమకు తెలియజేస్తే ప్రభుత్వ తరపు అధికారి శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిద్ధంగా వేచి ఉంటారన్నారు. వారు రాగానే ముఖాముఖి మాట్లాడేసి 15 రోజుల్లో కంపెనీని నెలకొల్పేందుకు అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేస్తామన్నారు. ఈ వ్యవహారాన్నంతా తానే స్వయంగా చేస్తానని కూడా చెప్పారు.