అవ్వ కూడా రెండున్నరేళ్లు ఆగాలా? జగన్ హామీపై బిత్తరపోయిన జనం.. ''అమ్మా'' అని పిలిచినా?

బుధవారం, 8 నవంబరు 2017 (11:54 IST)

ys jagan

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా వేంపల్లిలో జగన్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. రెండో రోజు పాదయాత్రలో ఓ వృద్ధురాలికి హామీ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఆ పార్టీ మహిళా నేత రోజా కూడా తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. 
 
ఈ వీడియోలో వేంపల్లిలో జగన్ మాట్లాడుతున్న సమయంలో ఓ వృద్ధురాలు తన కష్టాలను జగన్‌కు వివరించింది. తినేందుకు తిండి, ఉండేందుకు నివాసం లేదని.. చాలా కష్టాలు పడుతున్నానని చెప్పింది. దీనికి స్పందించిన జగన్ రెండున్నరేళ్లు ఎలాగోలా భరిస్తే కష్టాలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు. దీంతో పార్టీ శ్రేణులు సహా వృద్ధురాలు కూడా షాక్ అయ్యారు. దీంతో వృద్ధురాలు నిరాశతో వెనుదిరిగింది. జగన్ సమాధానంతో పక్కనే ఉన్న నేతలు కూడా విస్తుపోయారు. 
 
దీంతో పక్కనే ఉన్న ఎంపీ అవినాష్ స్పందించి జగన్ చెవిలో ఏదో చెప్పారు. వెంటనే తేరుకున్న జగన్ నిరాశతో వెళ్లిపోతున్న వృద్ధురాలిని.. 'అమ్మా, అమ్మా అని పిలుస్తూ..  ఇబ్బంది పడుతున్నావ్ కాబట్టి.. పులివెందులలో ఉన్న మన వృద్ధాశ్రమానికి పంపిస్తానని, అవినాష్‌తో చెప్పిస్తానని తెలిపారు. అయినా జగన్ మాటలను వృద్ధురాలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ వృద్ధురాలు వెళ్ళిపోయింది. 
 
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆహారం లేకుండా, ఇళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న వృద్ధురాలికి సాయం చేయాలన్నా రెండున్నరేళ్లు ఆగాలని జగన్ చెప్పడం సబబు కాదంటున్నారు. జగన్‌కు రెండున్నరేళ్లు ఓపిక పట్టండి అనే మాట అలవాటైపోయిందని.. అందుకే సాయం కోసం వచ్చినోళ్లతోనూ జగన్ అదే మాట అంటున్నారని.. టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.దీనిపై మరింత చదవండి :  
Vempalli Avinash Cotton Farmers Ys Jagan Old Woman

Loading comments ...

తెలుగు వార్తలు

news

నివాసానికి భూమి పనికిరాదు... మున్ముందు అగ్నిగోళమే : స్టీఫెన్ హాకింగ్

మనిషి మనుగడ సాగించేందుకు భూమి పనికిరాదట. ఎందుకంటే భూమి అగ్నిగోళంగా మారిపోనుందట. అందుకే ...

news

సోదరుడి అక్రమ సంబంధం: చెల్లెల్ని నగ్నంగా గంట పాటు ఊరేగించారు

పాకిస్థాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఓ గ్రామ పంచాయతీ ...

news

థియేటర్‌లో టాయి‌లెట్‌కెళ్లిన మహిళ.. చేయిపట్టిన లాగిన కార్మికుడు...

నిన్నటికినిన్న నెల్లూరులోని సినిమా థియేటర్‌లోని టాయ్‌లెట్‌కు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. ...

news

పూర్వ జన్మలో భార్యవని.. షికార్లకు తీసుకెళ్లి.. రేప్ చేసిన సాధువు.. ఎక్కడ?

మహిళలపై దొంగ బాబాల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ సాధువు భక్తి ...