శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (15:55 IST)

తెదేపాకు - వైకాపాకు కేవలం 5 లక్షల ఓట్లే తేడా: జగన్

గత మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, వైకాపాకు కేవలం 5 లక్షల ఓట్ల తేడా మాత్రమే వ్యత్యాసం ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ప్రకాశం జిల్లా పార్టీ సమీక్షా సమావేశాల్లో భాగంగా ఒంగోలులో మాట్లాడారు. కేవలం 5 లక్షల ఓట్ల వల్లే తమ పార్టీ అధికారంలోకి రాలేక పోయిందని, మరో 5 లక్షల ఓట్లు వైకాపాకు పోలైవున్నట్టయితే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసివుండేవాడినని చెప్పుకొచ్చారు. 
 
సోమవారం ప్రకాశం జిల్లాకేంద్రం ఒంగోలుకు వచ్చిన ఆయన జిల్లాలో పార్టీ పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి, తమకు కేవలం 5 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉందని గుర్తు చేశారు. గడచిన ఎన్నికల్లో తాము 5 లక్షల ఓట్ల తేడాతోనే ఓటమి చెందామని చెప్పుకొచ్చారు. 
 
ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు చంద్రబాబునాయుడు పలు అబద్ధాలు చెప్పారని ఆయన ఆరోపించారు. చంద్రబాబులా తాము కూడా అబద్ధాలు చెప్పి ఉంటే, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. చంద్రబాబుకు లేనిది, మనకున్నది దేవుడి దయ మాత్రమేనని ఆయన తన పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పారు.