Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా బాణం లక్ష్యం చంద్రబాబు.. పవన్‌తో చేతులు కలుపుతా : జగన్ మోహన్ రెడ్డి

ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (10:08 IST)

Widgets Magazine
jagan

తన బాణం లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఇందుకోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే, ప్రత్యేక హోదా కోసం జగన్‌తో కలిసేందుకు సిద్ధమని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
దీంతో తాజాగా జగన్ కూడా ఇదే తరహా సంకేతాలు పంపించారు. తాము కూడా పవన్‌తో జత కట్టేందుకు సిద్ధమన్నారు. తద్వారా, నారా చంద్రబాబు నాయుడిను అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా, 2019లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ స్థాపించిన జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై జగన్ పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రావడం గమనార్హం.
 
మరోవైపు... చంద్రబాబును అడ్డుకునేందుకు జనసేన సహా, సీపీఐ, సీపీఎం తదితర భావ సారూప్యమున్న పార్టీలతో పొత్తుకు సిద్ధమని ఆ పార్టీ నేత, ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన క్రమంలో తమతో ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తామన్నారు. హోదా కోసం వారితో కలసి పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీరని ద్రోహం చేసిందని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఎన్నడూ విశ్వసించే అవకాశం లేదని, అటువంటి ద్రోహం చేసిన పార్టీతో తాము సంబంధాలు పెట్టుకోబోమన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

హఫీజ్‌ సయీద్‌ను ఇంటి జైల్లో పెట్టారు.. పేరు మార్చుకున్నాడు, షరామామూలే

పాకిస్తాన్ ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్ నెలకొల్పిన ఉగ్రసంస్థ నిషేధానికి గురైన జమాత్ ఉద్ దవా ...

ట్రంప్ మాడు పగిలింది: ఫెడరల్ కోర్టు ఆదేశాలతో సీన్ రివర్సయింది

యావత్ ప్రపంచం వ్యతిరేకస్తున్నా, వలస ప్రజలపై నిషేధం అమానుషమని అమెరికా యావత్తు గొంతు ...

స్థానికులకు ఉద్యోగాలు కరువైతే ఎవరైనా ట్రంప్‌లు కావలసిందే: తేల్చి చెప్పిన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్

దేశంలో నిరుద్యోగితా స్థాయి దారుణంగా పడిపోతున్నప్పుడు ఏ దేశ రాజకీయ నేతలైనా నిరుద్యోగిత ...

news

ఏఐడిఎమ్‌కె సెక్రటరీ ఎవరైతే మాకేంటి.. అది వాళ్ల ఖర్మ.. అనేసిన వెంకయ్య

భార్యాభర్తల పంచాయితీలో తలదూర్చడమంత మతి లేని పని మరొకటి లేదని తెలుగు గ్రామాల్లో వాడుకగా ...

Widgets Magazine