Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బుట్టా రేణుకకు లాభాదాయక పదవీగండం..

మంగళవారం, 13 ఫిబ్రవరి 2018 (09:51 IST)

Widgets Magazine
butta renuka

వైకాపా ఎంపీ బుట్టా రేణుకపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈమె వైకాపా తరపున కర్నూలు లోక్‌సభ సభ్యురాలిగా ఉంటూనే కేంద్ర శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు (సీఎస్‌డబ్ల్యూబీ) జనరల్ బాడీ సభ్యురాలిగా కూడా కొనసాగుతున్నారు. ఇది లాభదాయకమైన పదవిగా పార్లమెంటరీ స్థాయి సంఘం పేర్కొని, ఆమెపై చర్యలకు సిఫారసు చేసినట్టు విశ్వనీయ వర్గాల సమాచారం. దీంతో ఆమెపై అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
నిజానికి జూలై 26, 2016లో లోక్‌సభ నుంచి బుట్టా రేణుక, రావత్‌లను సీఎస్‌డబ్ల్యూబీ సభ్యులుగా నియమిస్తూ కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంటరీ కమిటీ అధ్యయనంలో ఇది లాభదాయక పదవి అని తేలింది. దీంతో ఈ బోర్డులో సభ్యులుగా ఉన్న వారిపై అనర్హత వేటు వేయాలని సిఫారసు చేసింది.
 
ఎంపీగా ఉంటూనే మరో లాభదాయకమైన పదవిని అనుభవిస్తున్నట్టు వస్తున్న వార్తలపై రేణుక స్పందించారు. తనను ప్రభుత్వమే బోర్డులో నియమించిందని, ఈ విషయంలో తన ప్రమేయం ఎంతమాత్రమూ లేదని పేర్కొన్నారు. తనపై అనర్హత వేటుకు సిఫారసు చేసిన విషయం కూడా తనకు తెలియదన్నారు. సభ్యురాలిగా ఉన్నప్పటికీ బోర్డు నుంచి తాను ఎటువంటి జీతభత్యాలను అందుకోవడం లేదని రేణుక వివరించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దేశ ముఖ్యమంత్రుల్లో శ్రీమంతుడు ఎవరు?

దేశంలో మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో అత్యంత ధనవంతుడైన సీఎం ఎవరో తెలుసా? ...

news

కేంద్రానికి మనం సహకరించాం- మనకు కేంద్రం సహకరించాలి... సీఎం చంద్రబాబు

మూడున్నరేళ్లుగా కేంద్రానికి అన్నివిధాలా సహకరించాం. జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు తదితర ...

news

బస్సులో పక్కసీట్లో పురుషుడు హస్తప్రయోగం... వీడియో అప్‌లోడ్ చేసిన అమ్మాయి...

ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ఓ యువతి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మధ్యవయస్కుడైన ఓ ...

news

ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఫిబ్రవరి 13-14 తేదీలలో మహాశివరాత్రి వేడుకలు(Video)

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఫిబ్రవరి 13, 14 తేదీలలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు ...

Widgets Magazine