మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2017 (09:34 IST)

వైఎస్‌ఆర్‌ 8వ వర్ధంతి : కుటుంబ సభ్యుల ఘన నివాళులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు శనివారం ఉదయం వైకాపా అధినేత జగన్, ఆయన తల్లి విజయమ్మ, భార్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు శనివారం ఉదయం వైకాపా అధినేత జగన్, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి తదితరులు వెళ్లారు.
 
వైఎస్ సమాధి వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. కాగా, ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. ‘వైఎస్ఆర్ బతికే ఉన్నారు. ఎందుకంటే, ఎందరో జీవితాలను ఆయన మెరుగుపరిచారు... వైఎస్‌ఆర్ బతికే ఉన్నారు.. ఎందుకంటే, మన హృదయాల్లో ఆయన ఉన్నారు కాబట్టి’ అంటూ పేర్కొన్నారు. 
 
అలాగే, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్ఆర్ అభిమానులు రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఈ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈసందర్భంగా పలువురు నేతలు వైఎస్ఆర్ చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. కాగా, 2009 సెప్టెంర్ 2వ తేదీన పావురాలగుట్ట వద్ద జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ చనిపోయిన విషయం తెల్సిందే.