కులపిచ్చి ప్రొఫెసర్ల వేధింపుల వల్లే డాక్టర్ శిల్ప సూసైడ్ : ఎమ్మెల్యే రోజా

ఆ కులపిచ్చి ప్రొఫెసర్ల వేధింపుల వల్లే ప్రభుత్వ డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకుందని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఆరోపించారు. ఫ్రొఫెసర్ల లైంగిక వేధింపుల కారణంగా పీలేరుకు చెందిన ఆత్మహత్యకు పాల్పడిన విషయం త

Roja
pnr| Last Updated: బుధవారం, 8 ఆగస్టు 2018 (16:57 IST)
ఆ కులపిచ్చి ప్రొఫెసర్ల వేధింపుల వల్లే ప్రభుత్వ చేసుకుందని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఆరోపించారు. ఫ్రొఫెసర్ల లైంగిక వేధింపుల కారణంగా పీలేరుకు చెందిన  ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, ఈ అమ్మాయి కూడా కులపిచ్చి రాక్షసుల వల్లే చనిపోయిందన్న విషయం స్పష్టంగా అర్థమౌతోందన్నారు.
 
గవర్నర్ కు ఫిర్యాదు చేసినా ఓ మహిళకు రక్షణ లేకపోవడం దారుణమని.. పరిపాలనా లోపమని అన్నారు. ఆ అమ్మాయి ఫిర్యాదు చేసిన తర్వాత విచారణ చేసి నిందితులను శిక్షించి ఉంటే శిల్పకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. 
 
పాఠాలు బోధించాల్సిన గురువులే డాక్టర్ శిల్పపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా ప్రయోజం లేకుండా పోయిందని ఫలితంగా ఓ నిండు ప్రాణం బలైందన్నారు. 
 
ఈ కేసు విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీలో సభ్యులు ఈ జిల్లాకు చెందిన వారే ఉంటారని, వాళ్లందరూ ఈ ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తారని ఆరోపించారు. చంద్రబాబు పరిపాలనలో మహిళల అక్రమ రవాణా, వేధింపులు, ఆత్మహత్యలలో ఆంధ్రప్రదేశ్ నంబర్‌గా ఉందన్నారు. దీనిపై మరింత చదవండి :