బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-09-2022 శుక్రవారం దినఫలాలు - గౌరిదేవిని ఆరాధించినా మనోసిద్ది..

astro
మేషం :- ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యులను కలుసుకున్నా కార్యం నెరవేరదు. కిరణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు సంతృప్తికానవస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
 
వృషభం :- ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి చికాకులు వంటివి తలెత్తుతాయి. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. రావలసిన బకాయిలు సకాలంలో అందుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. సాహస ప్రయత్నాలు విరమించండి దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళుకువఅవసరం.
 
మిథునం :- రావలసిన బకాయిలు సకాలంలో అందుతాయి. గతంలో చేజారిన పత్రాలు చేతికందుతాయి. కుటుంబీకులతో కలిసి దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తుల ఓర్పు, పనితనానికి పరీక్షా సమయం. స్త్రీలకు పనిభారంవల్ల ఆరోగ్యము మందగిస్తుంది. సాహిత్య, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కర్కాటకం :- ద్విచక్రవాహనం పై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. రుణం ఏకొంతైనా తీర్చలన్న మీ యత్నం వాయిదాపడుతుంది. పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి.
 
సింహం :- ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. వ్యాపారాల్లో ఒకదానిలో వచ్చిన నష్టాన్ని మరొక విధంగా పూడ్చుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి పొందుతారు.
 
కన్య :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మిమ్మల్ని చూసి అసూయ పడేవారు అధికం అవుతున్నారని గ్రహించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు పురోభివృద్ధి.
 
తుల :- ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. మీ సంతానం మొండివైఖరి కారణంగా చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. ఆధ్యాతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాధ్యతలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
 
వృశ్చికం :- విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల ఇబ్బందులు తప్పవు. సోదరీ, సోదరులతో విబేధాలు తలెత్తుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. ఖర్చులు పెరిగానా ఇబ్బందులు ఉండవు. గృహాలంకరణ నిమిత్తం అధిక మొత్తంలో వ్యయం చేస్తారు. అపనిందలుపడే పరిస్థితులున్నాయి జాగ్రత్త వహించండి.
 
ధనస్సు :- దైవసేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. స్త్రీల సృజనాత్మకతకు, ప్రతిభకు తగినగుర్తింపు, రాణింపు లభిస్తుంది. ముఖ్య విషయాల్లో మీ జీవిత భాగస్వామీ సలహా, సహకారం తీసుకోవటం మంచిది. పారిశ్రామిక కార్మికులకు మధ్య పరస్పర అవగాహన లోపం. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి.
 
మకరం :- బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలు శారీరక మానసికవేదనకు గురవుతారు. బంధు మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారు మార్పులకై చేయుయత్నాల్లో సఫలీకృతులౌతారు. పాత రుణాలు తీరుస్తారు.
 
కుంభం :- బంధువుల రాకవల్ల గృహంలో సందడి కానవస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి బరువు బాధ్యతలు అధికమవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. కోర్టు పనులు వాయిదా పడతాయి. ముఖ్యుల కోసం విరివిగా ధనవ్యయం చేస్తారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమఫలితం.
 
మీనం :- స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుటమంచిది. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో ఆందోళన కలిగించగలదు. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అసవరం. విదేశీ ప్రయాణాలలో అడ్డంకులు తొలగిపోతాయి. శ్రమానంతరం మీరు కోరుకున్న ప్రాజెక్టులను దక్కించుకుంటారు.