Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కలబంద జ్యూస్‌తో అధిక బరువుకు చెక్...

గురువారం, 30 నవంబరు 2017 (14:08 IST)

Widgets Magazine
aloe vera juice

చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ శరీర బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. ముఖ్యంగా, ఉదయాన్నే నిద్రలేచి కిలోమీటర్లు కిలోమీటర్లు రన్నింగ్ చేస్తుంటారు. ఇలాంటి అలోవెరా (కలబంద) జ్యూస్‌ లేదా గుజ్జును క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఉదయం సేవిస్తే ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెపుతున్నారు. 
 
కలబంద జ్యూస్‌లో ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరం లోపల, బ‌య‌ట‌, అవయవాల చుట్టూ ఏర్పడే కొవ్వును కరిగిస్తాయి. కలబంద రసంలో ఉండే ఫైటోస్టెరోల్స్ అంతర్గతంగా జీవక్రియ రేటును రెట్టింపు చేస్తాయి. ఫలితంగా శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు ఈ జీవక్రియలో వినియోగించబడతాయి. దీంతో కొవ్వు క‌రిగి శరీర బరువు త‌గ్గుతుంది. 
 
ప్రతి రోజూ ఒక క‌ప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ కలబంద రసం, ఒక టీస్పూన్‌ అల్లం ర‌సం క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. దీంతో అతి త‌క్కువ స‌మ‌యంలోనే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇలాచేయడం వల్ల అధిక‌ బరువును త‌గ్గించుకుని శరీరాకృతిని అందంగా మార్చుకోవచ్చ‌ని వైద్య‌ నిపుణులు చెబుతున్నారు. 
 
అంతేకాకుండా, జీర్ణసమస్యలు, డయాబెటీస్‌కు చెక్ పెట్టొచ్చు. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు పూర్తిగా దూరమవుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంటుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. కేన్సర్ కణాలను నశింపజేస్తుంది. చర్మం కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది. టూత్ పేస్టుతో కలిపి దంతాలు తోముకుంటే చిగుళ్ళ బాధల నుంచి విముక్తి పొందవచ్చు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

డయాబెటిస్ పేషెంట్లకు బెల్లం మంచిదా?

బెల్లం చక్కర కంటే ఆరోగ్యకరమని అంటారు. డయాబెటిస్ పేషెంట్లు చక్కెర కంటే బెల్లాన్ని వాడటం ...

news

ఫుడ్‌ పాయిజనింగ్ అయిందా.. ఇలా చేయండి?

జీవన పోరాటంలో ప్రతి వ్యక్తీ కాలంతో పాటు పరుగెడుతున్నాడు. దీంతో కనీసం ప్రశాంతంగా కూర్చొని ...

news

భోజనం చేసిన వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా?

చాలా మందికి ఐస్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. అనేక మంది భోజనం చేసిన వెంటనే చల్లని నీరు ...

news

ఆ కారణంగానే భారతీయులకు గుండె జబ్బులు

భారతీయులు వివిధ రకాల ప్రాణాంతక జబ్బుల బారినపడటానికి గల కారణాలను శాస్త్రవేత్తలు ...

Widgets Magazine