శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : శనివారం, 17 జూన్ 2017 (15:11 IST)

ఊబకాయాన్ని దూరం చేసే పెసలు.. చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే?

పెసల్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని సోడియం దంతాలు, చిగుళ్ల సమస్యలను నివారిస్తుంది. బీపీ రోగులకీ పెసళ్లు ఎంతో మేలు చేస్తాయి. పెసల్లోని ఐరన్‌వల్ల అన్ని అవయవాలకీ ఆక్సిజన్‌ సమృద్ధిగా అందుతుంది. ఫ

పెసల్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని సోడియం దంతాలు, చిగుళ్ల సమస్యలను నివారిస్తుంది. బీపీ రోగులకీ పెసళ్లు ఎంతో మేలు చేస్తాయి. పెసల్లోని ఐరన్‌వల్ల అన్ని అవయవాలకీ ఆక్సిజన్‌ సమృద్ధిగా అందుతుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి... వంటి లోపాలతో బాధపడే వాళ్లకీ ఇవి ఎంతో మేలు. రోగనిరోధకశక్తినీ పెంచుతాయి. వీటిల్లోని విటమిన్లు హార్మోన్లను ప్రేరేపించడంతో పిల్లల్లో పెరుగుదలకీ తోడ్పడతాయి.
 
పెసళ్లను ఉడికించి లేదా మొలకెత్తించి తిన్నా.. జుట్టు బాగా పెరుగుతుది. కాలేయానికి మేలు చేస్తుంది. కళ్ల ఆరోగ్యానికి సహకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువగా ఉండటంతో కొంచెం తిన్నా పొట్ట నిండినట్లనిపిస్తుంది. ఫలితంగా వూబకాయం తగ్గుతుంది. కొలెస్ట్రాల్‌ సైతం తగ్గుతుంది. వీటిల్లోని కాల్షియం ఎముక నిర్మాణానికీ దోహదపడుతుంది. 
 
పెసల్ని క్రమం తప్పకుండా తినేవాళ్లు నిత్యయవ్వనులుగా కనిపిస్తారు. ఇందులోని కాపర్ వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. చర్మం ముడతలు పడకుండా రక్షిస్తుంది.