శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By kowsalya
Last Updated : బుధవారం, 2 మే 2018 (12:14 IST)

కంటిచూపుకు ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ.. ఏం చేయాలంటే?

కంటి చూపును మెరుగుపరుచుకోవాలంటే.. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయను సమానంగా తీసుకుని మెత్తగా దంచాలి. వీటి మెుత్తాలను కలిపి దీనికి సమానంగా పంచదార కలిపి రోజూ ఒక చెంచా పొడిని పాలలో కలిపి తీసుకుంటే వయసు మీద పడ

కంటి చూపును మెరుగుపరుచుకోవాలంటే.. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయను సమానంగా తీసుకుని మెత్తగా దంచాలి. వీటి మెుత్తాలను కలిపి దీనికి సమానంగా పంచదార కలిపి రోజూ ఒక చెంచా పొడిని పాలలో కలిపి తీసుకుంటే వయసు మీద పడుతున్నా కూడా కంటిచూపు మెరుగవుతుంది. ఇంకా శరీరం కాంతివంతంగా తయారవుతుంది. ఇంకా ముడతలు తగ్గిపోతాయి. చర్మ సౌందర్యం మెరుగవుతుంది. 
 
అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఆయుర్వేద ప్రకారం.. అశ్వగంధాది చూర్ణం ఇరవైదు గ్రాములు, షడ్గుణ సింధూరం ఐదు గ్రాములు, తీసుకుని దీన్ని అరవై భాగాలుగా చేసుకుని పూటకొక భాగం తేనెతే కలిపి తీసుకుంటే చర్మవ్యాధులు తగ్గి, చర్మం మృదువుగా తయారవుతుంది. మెుటిమలు నివారణవుతాయి. 
 
అలాగే షడ్గుణ సింధూరం రెండు గ్రాములు, పగడభస్మం ఐదు గ్రాములు, అభ్రక భస్మం ఐదు గ్రాములు, తిప్పసత్తు పదిగ్రాములు మెుత్తం బాగా కలిపి, ముప్పై భాగాలు చేసి, రోజూ ఉదయాన్నే, ఒకభాగం తేనెతో కలిపి తీసుకుంటూ వాసకారిష్ట అనే రెండు చెంచాలు త్రాగుతుంటే చర్మవ్యాధులన్నీ నివారిస్తాయి. దీనివలన ఇంకా దగ్గు, ఆయాసం, క్షయవంటివి త్వరగా నివారిస్తాయి.
 
షడ్గుణ సింధూరాన్ని నూటపాతిక మిల్లీగ్రాముల తమలపాకులో పెట్టుకుని నములుతూ రసాన్ని మింగిన శరీరం బలంగా, పుష్ఠిగా వుంటుంది. వయసుపైబడుతున్నా శరీరం యవ్వనాన్ని తెలుపుతుంది. ఈ మందులన్నీ ఆయుర్వేదషాపుల్లో లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.