శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 1 మే 2018 (12:40 IST)

వేసవిలో ఫ్రిజ్ వాటర్.. కుండలో వుంచిన నీటిని తాగండి..

వేసవికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను తీసుకోవాలి. వేసవిలో నూనె పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. ఇంట్లో చేసుకున్న నూనె వస్తువులు పరిమితంగా తీసుకోవడం వల్ల నష్టం లేదు కానీ రోడ్డు పక్కన లభించే నూ

వేసవికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను తీసుకోవాలి. వేసవిలో నూనె పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. ఇంట్లో చేసుకున్న నూనె వస్తువులు పరిమితంగా తీసుకోవడం వల్ల నష్టం లేదు కానీ రోడ్డు పక్కన లభించే నూనె పదార్థాలు మరింత హాని చేస్తాయి. ఫ్రిజ్‌లో ఉంచిన నీళ్లు తాగడం వల్ల ఎంతక దాహం తీరదు. కుండలో వుంచిన నీళ్లు తాగితే దాహం ఇట్టే తీరిపోతుంది. 
 
నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, పుచ్చపండు వేసవి తాపాన్ని చల్లారబరుస్తాయి. ఎండ పెరిగే లోపే తెరిచి ఉంచిన కిటీకీ తలుపు మూసేయండి. ఖర్జూరాలు తీసుకోవాలి. ఖర్బూజ పండ్లు కంటి సమస్యలను నయం చేస్తాయి. దృష్టి దోషాలను పోగొడతాయి. ఇంట్లో వాతావరణం చల్లగా వుండేలా చూసుకోవాలి. ఎండలోకి తప్పవిసరిగా వెళ్లేవారు సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పనిసరిగా వాడుకోవాలి.
 
పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజూ నీటిని అధికంగా తీసుకోవాలి. ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్లద్దాలు  వాడాలి. పిల్లలకు తల్లి పాలు తప్పనిసరిగా పట్టించాలి. వారిలో వ్యాధినిరోధక శక్తి పెంచాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇందుకోసం చేపలు, ఉసిరికాయ జ్యూస్‌ ఇవ్వడం చేయాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.