1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 1 మే 2018 (12:08 IST)

జాజికాయ గంధాన్ని అరగ్లాసు పాలలో కలిపి తాగితే...

జాజికాయను నీటితో మెత్తగా నూరి లేపనంగా రాస్తే.. ముఖం మీది నల్లటి మచ్చలు తొలగిపోతాయి. జాజికాయ, చందనం, మిరియాలు కలిపి నీటితో నూరి.. పైపూతగా వేస్తే మొటిమలు తగ్గిపోతాయి. జాజికాయలో ఫంగస్‌ను నిరోధించే గుణం ఉ

జాజికాయను నీటితో మెత్తగా నూరి లేపనంగా రాస్తే.. ముఖం మీది నల్లటి మచ్చలు తొలగిపోతాయి. జాజికాయ, చందనం, మిరియాలు కలిపి నీటితో నూరి.. పైపూతగా వేస్తే మొటిమలు తగ్గిపోతాయి. జాజికాయలో ఫంగస్‌ను నిరోధించే గుణం ఉంది. అందుచేత జాజికాయను నీటితో నూరి పూస్తే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. 
 
జాజికాయ గంధాన్ని అరగ్లాసు పాలలో కలిపి తాగితే శీఘ్ర స్కలన సమస్య తొలగిపోతుంది. నీటిలో గంటల పర్యంతం నానడం వల్ల కాలివేళ్ల మధ్య చర్మం దెబ్బతిన్న వారు, జాజికాయను నూరి వేళ్ల సందుల్లో పెడితే చాలా తొందరగా చర్మం చక్కబడుతుంది.
 
జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. వీర్యకణాల ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది. జాజికాయను కొద్దిపాటి మంటమీద నేతిలో వేయించి పొడిచేసి వుంచుకుని.. ఆ పొడిని ఐదు గ్రాముల మోతాదుగా ఉదయం, సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలతో కలిపి తాగాలి. ఇది నపుంసకత్వాన్ని దూరం చేస్తుంది. వీర్యకణాల సంఖ్యను తరిమికొడుతుంది.
 
జాజికాయను పొడిగొట్టి, అతి స్వల్ప పరిమాణంలో వాడినట్లయితే, కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో, చాలా స్వల్ప పరిమాణంలో ఈ పొడిని కలుపుకుని తాగితే చర్మ కాంతి పెరగడమే కాకుండా, చర్మం ముడతలను తొలగించుకోవచ్చు.