శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (11:52 IST)

త్రిఫల చూర్ణాన్ని నీటిలో మరిగించి ఇలా చేస్తే..?

నేటి తరుణంలో చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే కంటి చూపును కోల్పోతున్నారు. ఈ సమస్య నుండి విముక్తి చెందాలని బయటదొరికే మందులు, మాత్రలు, టానిక్స్ వాడుతున్నారు. శరీరంలో ఏ భాగం బాగాలేకపోయినా అవి తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తాయి.

దాంతో వైద్యులను సంప్రదించి వైద్య చికిత్సలు తీసుకుని వారిచ్చిన మాత్రలు వాడుతుంటారు. ఇలా చేయడం మంచిదే.. అందుకని జీవితాంతం ఇలా మందులు వాడలేం కదా. అందువలన ఆయుర్వేదం ప్రకారం ఈ పదార్థాలు తింటుంటే ఎలాంటి సమస్యలైన తొలగిపోతాయి. అవేంటో చూద్దాం...
 
బాహ్య కషాయం:
ఈ కషాయం కంటి చూపుకు ఎంతో సహాయపడుతుంది. చూపు మందగింపు వంటి సమస్యల నుండి కాపాడుతుంది. ఈ కషాయం ప్రతిరోజూ తీసుకోవడం వలన ఎలాంటి కంటి సమస్యలైన తొలగిపోతాయి. మరి దీనిని ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
త్రిఫల చూర్ణం - 2 స్పూన్లు
తగినంత నీరు
 
తయారీ విధానం:
ముందుగా నీటిలో త్రిఫల చూర్ణాన్ని కలిపి ఆపై బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా చల్లారిన తరువాత వడగట్టి ఉంచుకోవాలి. ఆ తరువాత ఈ నీటితో కళ్లను కడుక్కోవాలి. ఇలా రోజుకు ఒక్కసారి కడుక్కుంటే సరిపోతుంది. ఈ నీటిలో కొద్దిగా తేనె కలిపి తీసుకున్నా కూడా కంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రివేళ భోజనం తర్వాత ఈ కషాయాన్ని నెలరోజులపాటు తీసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది.