గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (10:39 IST)

పాలకూరను ఉడికించి తీసుకుంటే..?

ఒకప్పటి కాలంలో గుండె వ్యాధులనేవి వయసు ఎక్కువగా ఉన్నవారికి వచ్చేవి. కానీ, ఇప్పటి తరుణంలో వయసు తేడా లేకుండా ఎవరు పడితే వారికి గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. అందుకు కారణం వారు సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం లేదని వైద్యులు వెల్లండిచారు.

నేటి ఉరుకు పరుకు జీవితంలో డబ్బు డబ్బు అంటూ దీని కోసమే బ్రతుకుతున్నారు.. చాలామంది. ఇంకొందరైతే ఈ డబ్బు కోసం తినడం కూడా మానేస్తున్నారు. ఈ పద్ధతి ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు వైద్యులు. ఇలా చేయడం వలన గుండె వ్యాధులు కొని తెచ్చుకున్నట్టవుతుందని చెప్తున్నారు. గుండె వ్యాధుల నుండి విముక్తి పొందాలంటే.. 
 
నిత్యం పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల నుండి ఉపశమనం లభిస్తుందని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పాలకూరలో కొన్ని పచ్చిమిర్చి, టమోటాలు, చింతపండు, ఉప్పు వేసి ఉడికించి మిశ్రమాన్ని అన్నంలో కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. 
 
వాల్‌నట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటలో ఎంతో దోహదం చేస్తాయి. ఎందుకంటే.. ఈ చెడు కొలెస్ట్రాల్ కారణంగానే గుండె జబ్బులు వస్తున్నాయి. వాల్‌నట్స్‌ తీసుకోవడం వలన అధిక బరువు, హైబీపీ, డయాబెటిస్ వంటి వ్యాధులు రావు. వాల్‌నట్స్‌లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తప్రసరణకు చాలా ఉపయోగపడుతాయి. కనుక రోజూ వాల్‌నట్స్ తీసుకోండి.. ఎలాంటి వ్యాధులు దరిచేరవు.