ముల్లంగి రసాన్ని తరుచుగా ఆహారంలో చేర్చుకుంటే?

గురువారం, 2 ఆగస్టు 2018 (10:05 IST)

ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ముల్లంగి ఆకులను, దుంపలను ఎండబెట్టుకుని మెత్తగా దంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని తేనెలో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే శరీరంలోని వాపులు, నొప్పులు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును. పచ్చి ముల్లంగి దుంపలు లేదా దాని ఆకులను రసంగా చేసుకుని తీసుకుంటే  విరేచననాలకు మంచిగా ఉపయోగపడుతుంది.
radish juice" width="600" />
 
ముల్లంగి విత్తులను బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజూ అన్నంలో కలుపుకుని తీసుకుంటే స్త్రీలలో రుతు సంబంధ వ్యాధుల నుండి విముక్తి చెందవచ్చును. ఆగకుండా వెక్కిళ్లు వస్తున్నప్పుడు కొద్దిగా ముల్లంగి రసాన్ని తాగితే వెంటనే తగ్గిపోతాయి. విపరీతమైన జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న వారికి ముల్లంగి రసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడంలో ముల్లంగి ఎంతో దోహదపడుతుంది. ఈ ముల్లంగి ఆకులను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే అస్సలు రాళ్లు ఏర్పడే అవకాశామే ఉండదు. ఈ ముల్లంగి రసంలో కొద్దిగా నువ్వుల నూనెను కలుపుకుని వడబోసి ఒక డబ్బాలో నిల్వచేసుకోవాలి. ఈ ముల్లంగి నూనె మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
అప్పుడప్పుడు కొంతమందికి చెవిపోటు వస్తుంటుంది. అటువంటి వారు ఈ ముల్లంగి నూనెను చెవిలో వేసుకుంటే వెంటనే మంచి ఫలితాలను పొందవచ్చును. అంతేకాకుండా కీళ్లనొప్పులు ఉన్నచోట కూడా ఈ నూనెతో మర్దన చేసుకుంటే ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. దీనిపై మరింత చదవండి :  
ముల్లంగి రసం ఆకులు నూనె ఉపయోగాలు చెవిపోటు కీడ్నీ రాళ్లు విరేచనాలు కీళ్లనొప్పులు ఆరోగ్యం ఆయుర్వేదం కథనాలు Radish Juice Oil Leaves Health Benefits Uses Kidneys Ear Pains Diarrhea Arthritis

Loading comments ...

ఆరోగ్యం

news

మామిడి టెంకను పారేస్తున్నారా... ఇలా చేస్తే...

వర్షాకాలం వచ్చినా కూడా మామిడికాయలకు మాత్రం కొరవుండదు. ఈ మామిపికాయలో గల టెంకలో ఆరోగ్య ...

news

ప్రతిరోజూ పొన్నగంటి ఆకుకూరను తీసుకుంటే?

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. ప్రత్యేకంగ పొన్నగంటి కూరను ...

news

రోడ్ల మీద అమ్మే తిండి తింటే అంతే సంగతులు

నగరవాసులు పనుల హడావుడిలో ఆరోగ్యంపై శ్రద్ధ లేకుండా ఏవి పడితే అవి తినేస్తున్నారు. వారి ఆహార ...

news

బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా? ఎలా తప్పించుకోవాలంటే? (vide0)

బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా.. శరీరంలో ఐరన్-ప్రోటీన్ లోపం వల్లేనని ఆరోగ్య నిపుణులు ...

Widgets Magazine