కాకరకాయ రసంలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే?

శుక్రవారం, 19 మే 2017 (13:38 IST)

కాకరకాయ జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే అనారోగ్య సమస్యలుండవ్. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాకర పైల్స్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. కాకర ఆకులు మూడింటిని తీసుకుని రసాన్ని పిండుకుని.. ఒక గ్లాసు మజ్జిగతో కాకర రసాన్ని కలిపి పరగడుపున నెలపాటు తీసుకుంటే పైల్స్ సమస్య చాలా మటుకు తగ్గిపోతుంది.
 
అలాగే కాకరకాయ చెట్టు వేళ్లు  వేళ్లను పేస్టులా చేసి పైల్స్‌ ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలోనూ, రక్తంలోని మలినాలను తొలగించడంలో భేష్‌గా పనిచేస్తుంది. 
 
ఇంకా కాకరలో హైపోగ్లైసెమిక్ పదార్థాలుంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కాకర రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్‌ దరిచేరకుండా ఉంటుంది. లివర్‌ శుభ్రపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వంటకు ఈ నూనెలు మంచివే... పామ్ ఆయిల్‌ వినియోగం మోతాదుకు మించితే?

వంటకు ఉపయోగించే నూనెల ద్వారానే ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ...

news

చల్లని నీరు తాగితే లివర్ చెడిపోతుందట.. నిజమేనా?

వేసవికాలంలో చాలామంది చల్లటి నీటిని సేవిస్తుంటారు. చల్లటి నీరు లేనిదే కొద్ది సేపు కూడా ...

news

రుచిగా వుండే మినరల్ వాటర్ తాగుతున్నారా? కాస్త ఆగండి..

బోర్‌వెల్ నుంచి వచ్చే వాటర్ తాగకుండా.. మినరల్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా? ఈ నీటిలోని ...

news

మండు వేసవిలో మలయమారుతం ఖర్బుజా

వేసవిలో వేడిగాలులు, దప్పిక నుంచి శరీరాన్ని రక్షించే గుణం గల ఖర్బూజా పండు అధిక బరువును ...