మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (11:08 IST)

అరటి ముక్కలను ఎండబెట్టి తేనె - బెల్లంలో కలుపుకుని తింటే..

అరటి కాయను ఇష్టపడని వారంటూ ఉండరు. నిండుగా పోషక విలువలు కలిగిన ఈ పండును... చాలా మంది భోజనం తర్వాత ఆరగిస్తారు. పూజాకార్యక్రమాల్లోనూ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అలాగే, పలు రకాల రోగాల బారిన పడిన వ్యక్తులు త్వరగా కోలుకునేందుకు అరటి పళ్లు ఆహారంగా ఇస్తారు. ఎందుకంటే ఇది చాలా తేలికగా జీర్ణమయ్యే ఆహారం. అరటి కాయను కూరల్లో వాడతాం.
 
అయితే, అరటి కూర వేడి చేస్తుంది. కానీ అరటి పండు చలువ చేస్తుంది. బాగా లేత పిందెలా ఉన్న అరటి కాయని చిన్న చిన్న ముక్కలుగా కత్తరించి ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండబెట్టిన తర్వాత చూర్ణం చేసి తేనేతో గాని, బెల్లంతో గాని కలిపి తీసుకుంటే విరేచనాలు, అమీబియాసిస్ వంటివి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న వారు, మూత్రపిండంలో రాయి ఉన్న వారు అరటిని ఏ రూపంలో ఉపయోగించినా మంచిదే.