శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (11:48 IST)

జామ ఆకుల మిశ్రమాన్ని పంటిపై రాసుకుంటే..?

జామఆకులతో టీ తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ సాఫీగా జరుగుతుంది. అధిక బరువును తగ్గించుటకు మంచిగా ఉపయోగపడుతుంది. జామకాయ జ్యూస్ కాలేయా ఆరోగ్యానికి మంచి టానిక్‌లా సహాయపడుతుంది. ఇన్సులిన్ ఉత

జామ ఆకులతో టీ తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ సాఫీగా జరుగుతుంది. అధిక బరువును తగ్గించుటకు మంచిగా ఉపయోగపడుతుంది. జామకాయ జ్యూస్ కాలేయ ఆరోగ్యానికి మంచి టానిక్‌లా సహాయపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. జామపండులోని విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుటకు మంచిగా దోహదపడుతుంది.
 
రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. జామకాయలను తీసుకోవడం వలన పంటి నొప్పులు తొలగిపోతాయి. దంతాలు, గొంతు, చిగుళ్ళు నొప్పిగా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జామ ఆకులకు తీసుకుని అందులో కొద్దిగా చింతపండు, ఉప్పు వేసి తింటే ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. తద్వారా ఆరోగ్యమైన జీవితం మీ సొంతం చేసుకోవచ్చును. 
 
జామపండులోని యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. జామ ఆకులను మిశ్రమాన్ని పంటిపై రాసుకుంటే చిగుళ్లు నొప్పులు తగ్గిపోతాయి.