మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 31 అక్టోబరు 2018 (14:13 IST)

తేనె, నిమ్మరసంతో అల్సర్ వ్యాధికి చెక్...

ఇటీవలే ఓ పరిశోధనలో తేనెలో గల ఆరోగ్య ప్రయోజాలు పరిశీలించారు. అవేంటో తెలుసుకుందాం. ప్రతిరోజూ రాత్రివేళల్లో తేనె తీసుకునే వారికి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పరిశోధనలో తెలియజేశారు. అందువలన రోజూ నిద్రకు ఉపక్రమించే ముందుగా గ్లాస్ పాలలో కొద్దిగా తేనె, చక్కెర కలిపి తీసుకుంటే బలహీనంగా ఉన్నవారు కాస్త పుష్టిగా మారుతారు
 
శ్వాసకోస వ్యాధులతో బాధపడేవారు అల్లం రసంతో 2 స్పూన్ల తేనె కలిపి సేవిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపర్చుతుంది. కడుపులో వ్యర్థాలను తొలగిస్తుంది. ఎక్కిళ్లు ఎక్కువగా వస్తున్నప్పుడు కొద్దిగా తేనెను సేవిస్తే మంచిది. అలానే ఉల్లిపాయ రసంలో తేనే, యాలకుల పొడి కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది. 
 
గుండె ధమనులకు తేనె చాలా మంచిది. పొడి దగ్గు గలవారు తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. తరచుగా తేనెను తీసుకోవడం వలన మాంసకృతులు బలవర్ధకంగా మారుతాయి. అల్సర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ టీలో కొద్దిగా తేనె కలిపి సేవిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పడుకునే ముందుగా తేనెలో నిమ్మరసం తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.