మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : సోమవారం, 1 జనవరి 2018 (15:35 IST)

నువ్వుండలు పిల్లలకు తినిపిస్తే ఏమౌతుంది?

నువ్వులు, బెల్లం కలిపి చేసిన నువ్వుండలు పిల్లలకు తినిపిస్తే శీతాకాలంలో జలుబు, దగ్గును దూరం చేస్తాయి. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే రక్తహీనత రాకుండా చేసుకోవచ్చు. విటమిన్‌ సి అధికంగా ఉండే నిమ్మ,

నువ్వులు, బెల్లం కలిపి చేసిన నువ్వుండలు పిల్లలకు తినిపిస్తే శీతాకాలంలో జలుబు, దగ్గును దూరం చేస్తాయి. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే రక్తహీనత రాకుండా చేసుకోవచ్చు. విటమిన్‌ సి అధికంగా ఉండే నిమ్మ, ఉసిరి, జామ వంటివాటితో కలిపి బెల్లాన్ని తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

మోకాళ్ల నొప్పులకు బెల్లం విరుగుడుగా పనిచేస్తుంది. శరీరంలోని ట్యాక్సిన్లను తొలగిస్తుంది. తద్వారా చర్మ సమస్యలను దరిచేరనివ్వకుండా చూసుకోవచ్చు. బెల్లంలోని జింక్‌, సెలీనియంలు శరీరం ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా చేస్తాయి. బెల్లానికి వేడిపుట్టించే గుణం, వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. ఇంకా బెల్లం ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరుస్తుంది. 
 
పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే.. గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. జలుబుతో ముక్కు కారుతుంటే పెరుగు, బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది. బెల్లం, నెయ్యి సమపాళ్ళలో కలిపి తింటే మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది. భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.