నెలసరి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. టీ, కాఫీలొద్దు..
నెలసరి సమస్యలను దూరం చేసుకోవాలంటే.. పోషకాహారం తీసుకోవాలి. అంతేగాకుండా నువ్వులు, బొప్పాయిని డైట్‌లో చేర్చుకోవాలి. నెలసరిని క్రమం తప్పకుండా రావాలంటే వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. దీనివల్ల బరు
నెలసరి సమస్యలను దూరం చేసుకోవాలంటే.. పోషకాహారం తీసుకోవాలి. అంతేగాకుండా నువ్వులు, బొప్పాయిని డైట్‌లో చేర్చుకోవాలి. నెలసరిని క్రమం తప్పకుండా రావాలంటే వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. దీనివల్ల బరువు అదుపులో ఉండటమే కాదు.. నెలసరి సమస్యలూ తగ్గుతాయి.
హార్మోన్లను క్రమబద్ధం చేసే అద్భుతమైన గుణం నువ్వుల్లో ఉంది. నువ్వులను దోరగా వేయించి అందులో కొంచెం బెల్లాన్ని కలిపి ముద్దగా చేసుకుని ప్రతిరోజూ తినాలి. నెలసరి వచ్చేందుకు మూడోవారంలో దీన్ని తీసుకుంటే మంచిది. దీనివల్ల రక్తహీనత సమస్య కూడా ఎదురుకాదు. క్యాల్షియం కూడా సమృద్ధిగా అందుతుంది.
రోజూ ఉదయం కప్పు బొప్పాయి పండు ముక్కల్ని తినాలి. ఇందులో వుండే పీచు గర్భాశయం గోడలను ఆరోగ్యంగా మారుస్తుంది. శరీరానికి విటమిన్ ఎను అందిస్తుంది. చిటికెడు దాల్చిన చెక్క పొడిని గ్లాసు వేడి పాలల్లో కలిపి రోజూ తాగితే మంచిది.
నెలసరి సమయంలో ఎదురయ్యే రకరకాల సమస్యల్ని అదుపులో ఉంచాలంటే కాఫీ, టీలు తగ్గించాలి. బదులుగా పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. హెర్బల్‌టీలు తాగాలి. గ్లాసు చెరకురసం లేదా ద్రాక్ష తీసుకుంటే మంచిది.