శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By selvi
Last Updated : మంగళవారం, 9 జనవరి 2018 (12:33 IST)

డెలివరీ తర్వాత ఇలా చేస్తే బరువు పెరగరు..

ప్రసవం తర్వాత పోషకాహారం తీసుకోవాలి. ప్రసవానంతరం తీసుకునే ఆహారంపై అనుమానాలుంటాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. ప్రసవం తర్వాత పప్పును ఆహారంలో రోజూ ఓ కప్పు చేర్చుకోవాలి. నీటిన

ప్రసవం తర్వాత పోషకాహారం తీసుకోవాలి. ప్రసవానంతరం తీసుకునే ఆహారంపై అనుమానాలుంటాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. ప్రసవం తర్వాత పప్పును ఆహారంలో రోజూ ఓ కప్పు చేర్చుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. రెగ్యులర్‌గా స్నానం చేయాలి. మసాజ్  చేయించుకోవాలి. అప్పుడే కండరాలు పటుత్వం కోల్పోకుండా వుంటాయి. 
 
సిజేరియన్ అయినట్లైతే కుట్ల దగ్గర కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నెలకొకసారి వైద్యులను సంప్రదించాలి. గర్భం దాల్చినప్పటి నుంచి వేసుకుంటూ వస్తున్న ఐరన్, క్యాల్షియం మాత్రలను డెలివరీ తర్వాత కూడా వేసుకుంటూ వుండాలి. వాటిని మానేయకూడదు. 
 
డెలివరీ తర్వాత మూడు నెలల పాటు ఈ మాత్రలను వాడాలి. అప్పుడే రక్త హీనతను దూరం చేసుకోవచ్చు. అందుకే ప్రసవానికి అనంతరం ఆహారంపై ఆంక్షలు పెట్టుకోకుండా ఆకుకూరలు, పండ్లు, పప్పులు అధికంగా తీసుకోవాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.