1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (22:40 IST)

లెమన్ గ్రాస్ టీ సేవిస్తే.. డయాబెటిస్ మటాష్ (video)

Lemon Grass Tea
శరీరంలోని ట్యాక్సిన్లను తొలగించుకోవాలంటే.. లెమన్ గ్రాస్ టీ సేవించాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. శరీరంలోని మలినాలను తొలగించుకోవడం ద్వారా డయాబెటిస్ దరిచేరదు. తద్వారా అనారోగ్య సమస్యలు కూడా రోజురోజుకీ తగ్గుముఖం పడుతాయి. 
 
అంతేగాకుండా.. లెమన్ గ్రాస్ టీని తరచూ తీసుకుంటే.. శరీరంలోని మలినాలు వెలివేయబడుతాయి. అలాగే శరీరానికి ఉత్సాహం చేకూరుతుంది. ఇంకా కిడ్నీ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. అంతేగాకుండా జుట్టు రాలే సమస్య వుండదు. 
 
జుట్టు పెరిగేందుకు ఇందులోని విటమిన్ ఎ, విటమిన్ బి వంటివి ఉపకరిస్తాయి. నెలసరి సమయంలో ఏర్పడే నొప్పులకు లెమన్ గ్రాస్ టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. లెమన్ గ్రాస్ టీ అంటు వ్యాధులను నిరోధిస్తుంది. 
 
ఈ టీని ఎలా చేయాలంటే.. లెమన్ గ్రాస్‌ను నీటిలో శుభ్రపరిచి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని.. బాగా నీటిలో మరిగించాలి. పదిహేను నిమిషాల తర్వాత.. ఆరిన తర్వాత వడగట్టి తీసుకుంటే ఆరోగ్యంగా వుండవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.