గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2019 (11:20 IST)

పాలు, నిమ్మరసంతో ఫేస్‌ప్యాక్..?

వేసవిలో చర్మం కమిలిపోతుంది. దాంతో పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దీని కారణంగా చర్మం పొడిబారడం వలన కొన్ని డ్రస్‌‍లు వేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా అనిపించడం ఆలస్యం టాన్ పోగొట్టేందుకు రసాయనాలతో కూడిన బ్లీచ్‌లు వాడుతారు. అవి కొందరికి పడక సమస్య తీవ్రమవుతుంది. ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే.. ఇంట్లో లభించే సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్స్‌ను వాడాలి. 
 
వేసవి షేషియల్ బ్లీచ్:
ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో 4 స్పూన్ల పాలు, స్పూన్ తేనె, స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని టాన్ అయిన భాగాలపై రాసుకుని పావుగంట పాటు అలానే ఉండాలి. ఆ తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే.. జిడ్డు చర్మం వాళ్లకు ఇది చక్కటి బ్లీచ్‌గా పనిచేస్తుంది.
 
పెరుగు, తేనె ఫేస్‌ప్యాక్:
నాలుగు స్పూన్ల పెరుగును ఓ బౌల్‌లో వేసుకుని అందులో 2 స్పూన్ల తేనె, 3 స్పూన్ల నిమ్మరసం కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటపాటు అలానే ఉండాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.