శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 15 జులై 2014 (18:04 IST)

సహజ సిద్ధమైన హెయిర్ ప్యాక్ బొప్పాయి!

కురుల సంసరక్షణకు సహజసిద్ధమైన హెయిర్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. తలలోని దుమ్ము, జిడ్డును పోగొట్టడమే కాదు రసాయనాల గాఢతను తొలగిస్తుంది. బొప్పాయిలో ఉండే ఏ, సి విటమిన్లు పొటాషియమ్, మెగ్నిషయం గుణాల వల్ల వెంట్రుకలు నిగనిగలాడుతాయి. పావుకప్పు బొప్పాయి గుజ్జును తలకు పట్టించి, అరగంట తర్వాత నీటితో శుభ్రపరచండి. జుట్టుకు ఈ మాస్క్ మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. చర్మ నిగారింపులోనూ బొప్పాయి మహత్తరంగా పనిచేస్తుంది. 
 
అలాగే, నిమ్మరసం కూడా ఎంతో మేలైనది. ఎక్కువ ఖర్చు లేకుండానే చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. బయటకు వెళ్లేముందు నిమ్మరసాన్ని కొద్దిగా నీళ్లలో కలిపి, జుట్టుకు స్ప్రే చేయాలి. దీంతో సూర్యకాంతి నేరుగా శిరోజాలకు తగిలి, దెబ్బతినకుండా ఉంటాయి. తలస్నానం చేయడానికి ముందు నిమ్మరసాన్ని మాడుకు పట్టించి, రుద్దితే చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఎక్కువ జిడ్డుగా ఉంటే, నిమ్మరసం కలిపిన నీటిని తలను శుభ్రపరచడానికి వాడాలి.