శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : శనివారం, 17 ఫిబ్రవరి 2018 (17:13 IST)

ఉసిరికాయ పొడి.. నీటిలో కలిపి ఇనుప పాత్రలో నానబెట్టి?

ఉసిరికాయను ఎండబెట్టి పొడి చేసుకుని తలకు పట్టించవచ్చు. ఇనుప పాత్రలో ఉసిరికాయ పొడి, తగినంత నీరు పోసి ఒక గంట నాననివ్వాలి. దీంతో తలకు రుద్దుకుంటే షాంపూగానూ, కండిషనర్‌గానూ ఉపయోగపడుతుంది. ఇలా చేస్తే తెల్లజు

ఉసిరికాయను ఎండబెట్టి పొడి చేసుకుని తలకు పట్టించవచ్చు. ఇనుప పాత్రలో ఉసిరికాయ పొడి, తగినంత నీరు పోసి ఒక గంట నాననివ్వాలి. దీంతో తలకు రుద్దుకుంటే షాంపూగానూ, కండిషనర్‌గానూ ఉపయోగపడుతుంది. ఇలా చేస్తే తెల్లజుట్టు బ్రౌన్‌గా మారుతుంది. 
 
ఇంకా జుట్టు రంగు మారదు. అలాగే జుట్టు రాలడం, తెల్లబడటం, పొడిబారడం, చిట్లి పోవడం వంటి సమస్యలకు, చుండ్రుని నివారించేందుకు హెన్నాలో ఆమ్లా పౌడర్‌ని కలిపి తలకు పట్టించాలి. ఆమ్లా పౌడర్ దొరకని పక్షంలో ఉసిరి కాయలను గింజలు తీసి మెత్తగా గ్రైండ్ చేసి హెన్నాలో కలుపుకోవాలి. అలాగే ఉసిరికాయ రసం సహజసిద్ధమైన ఆస్ట్రింజెంట్. ఈ రసంలో దూదిని అద్ది ముఖాన్ని తుడిస్తే.. కాలుష్యం, జిడ్డు వదిలి చర్మం శుభ్రం కావడంతో పాటు మెరిసిపోతుంది. 
 
ఇంట్లోనే బ్యూటీ క్రీములు తయారీ ఎలా?
గులాబీలు సౌందర్యానికి ఎంతో మేలు చేస్తున్నాయి. అలాంటి గులాబీలతో క్రీమ్‌ను ఇంట్లోనే చేసుకోవచ్చు. నాలుగు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, బాగా వాసన వెదజల్లే గులాబీ రేకులు రెండు కప్పులు, తేనె మైనం ఒక టేబుల్ స్పూన్, వర్షం నీరు లేదా శుభ్రమైన నీటిని తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్‌‌ను మరిగే స్థాయి వరకు వేడి చేసి అందులో గులాబీ రేకులు వేయాలి. 
 
దీనిని సీసాలోకి తీసుకుని సుమారు వారం రోజులు ఉంచాలి. ఇలా నూనెలో గులాబీలు బాగా కలిశాక.. వడపోసి గులాబీ రేకులను వేరు చేసుకోవాలి. హనీ వ్యాక్స్‌ను ఒక పాత్రలోకి తీసుకునే కరిగే వరకు వేడి చేసి.. ఆలివ్ నూనెలో కలిపి చల్లబరచాలి. చివరిగా ఒకటి లేదా రెండు స్పూన్ల నీటిని చేర్చి భద్రపరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు నెలల పాటు వాడుకోవచ్చు.