శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (09:57 IST)

ఉల్లిపాయ రసంతో జుట్టును పెంచుకోండి.. ఎలాగంటే?

జుట్టు రాలిపోతుందా? అయితే ఉల్లిపాయల రసంతో ప్యాక్ వేసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే ఉల్లిపాయల నూనె వాడటం ద్వారా జుట్టు వత్తుగా పెరుగుతుంది. అంతేకాదు మగవారిలో బట్టతలను కూడా ఉల్లిపాయ ఆయిల్‌ తొలగిం

జుట్టు రాలిపోతుందా? అయితే ఉల్లిపాయల రసంతో ప్యాక్ వేసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే ఉల్లిపాయల నూనె వాడటం ద్వారా జుట్టు వత్తుగా పెరుగుతుంది.

అంతేకాదు మగవారిలో బట్టతలను కూడా ఉల్లిపాయ ఆయిల్‌ తొలగించుకోవచ్చు.  మూడు మీడియం సైజు ఉల్లిపాయలు, నాలుగు దాల్చిన చెక్క ముక్కలు తీసుకుని పొడి చేసుకుని.. అందులో ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని కలుపుకోవాలి. 
 
అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, 20 కరివేపాకు ఆకులు, వంద గ్రాముల కొబ్బరి నూనెను తీసుకోవాలి. ఆపై ఒక బౌలు తీసుకొని అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. కాస్త వేడి అయిన తర్వాత దాల్చిన చెక్క పొడి, కరివేపాకు వేసి మూడు నిమిషాల పాటు మరిగించాలి. తరువాత అందులో ఉసిరి పొడి వేసి 2 నిమిషాలు మరిగించాలి. 
 
ఆపై మళ్లీ స్టౌ ఆన్ చేసి అందులో ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ నుంచి దించి చల్లారనివ్వాలి. చల్లారిన నూనె వడబోసి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి. ఈ నూనెను వారానికి రెండు సార్లు తలకు పట్టించి రెండు, మూడు గంటల తరువాత వాష్ చేసుకోవాలి.