శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2014 (17:33 IST)

హెయిర్ లాస్‌కు చెక్ పెట్టే ఆమ్లా ప్యాక్

జు ట్టు రాలిపోతుంటే... ఈ చిట్కాలు పాటించండి. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, కాలుష్యం, షాంపుల ప్రభావంతో జుట్టు రాలుతుంది. హెయిర్ ట్రీట్మెంట్లు, హెయిర్ ప్యాక్‌ల ద్వారా జుట్టు పొందే కంటే ఇంట్లో సింపుల్‌గా ఈ టిప్స్ పాటించండి. జుట్టు రాలే సమస్యను నివారించడానికి ఆమ్లా ఆయిల్ రెగ్యులర్ బేస్‌లో ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.  
 
మార్కెట్లో వివిధ రకాలుగా ఆమ్లా ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి . అంతే కాదు, ఆమ్లా పౌడర్, మెంతి పౌడర్, మరియు కొబ్బరి నూనె ఉపయోగించి ఇంట్లోనే ఆమ్లా ఆయిల్‌ను తయారుచేసుకోవచ్చు. 
 
ఈ నూనెను తలకు పట్టించి అరగంట పాటు ఉంచుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఈ నూనెను అప్లై చేసిన అరగంట తర్వాత షాంపు పెట్టి తలస్నానం చేసుకుంటే జుట్టు మృదువుగా ఉంటాయి. ఇంకా జుట్టు పెరగడంతో పాటు హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. 
 
హెయిర్ లాస్‌కు చెక్ పెట్టే ఆమ్లా ప్యాక్.. 
 
హెయిర్ లాస్ నివారించాలంటే.. గుడ్డు, ఆమ్లా పౌడర్, శీకాకాయ పౌడర్, రీటా పౌడర్‌లను పేస్ట్‌లా చేసుకుని ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాసి. కేవలం గుడ్డు మరియు ఆమ్లా కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టుకు ఒక మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది. ఈ ప్యాక్ ద్వారా మీ హెయిర్ స్ట్రాంగ్ అండ్ లాంగ్‌గా తయారవుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.