శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (13:44 IST)

బార్లీ గింజలతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

బార్లీ గింజలు.. గసగసాల పేస్టును ముఖానికి అప్లై చేస్తే మెరిసే సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బార్లీ, గసగసాల పేస్టులో ఐదు చుక్కల నిమ్మసరం, కొంచెం రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఇలా తయారైన పేస్టును ముఖానికి రా

బార్లీ గింజలు.. గసగసాల పేస్టును ముఖానికి అప్లై చేస్తే మెరిసే సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బార్లీ, గసగసాల పేస్టులో ఐదు చుక్కల నిమ్మసరం, కొంచెం రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఇలా తయారైన పేస్టును ముఖానికి రాసుకుని అరగంట అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. కమలా పండు.. వీటి తొక్కలను ఎండలో ఎండబెట్టండి. అనంతరం దీనిని పౌడర్‌గా చేసుకోవాలి. 
 
ఈ మిశ్రమంలో ఒక చెండా పౌడర్, మరో చెంచా పెరుగు, ముల్తాని మట్టీ, ఒక చెంచా చందనం పొడులను కలుపుకోవాలి. నీటితో కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట అనంతరం నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మ ఛాయ మెరుగవుతుంది. మృదువైన చర్మం మీ సొంతం అవుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.