గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 18 జూన్ 2018 (19:54 IST)

బార్లీ గింజలతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే...

బార్లీ గింజలు గసగసాల పేస్టును ముఖానికి రాసుకుంటే మెరిసే సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చును. బార్లీ, గసగసాల పేస్టులో ఐదు చుక్కుల నిమ్మరసం, కొంచెం రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకున

బార్లీ గింజలు గసగసాల పేస్టును ముఖానికి రాసుకుంటే మెరిసే సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చును. బార్లీ, గసగసాల పేస్టులో ఐదు చుక్కుల నిమ్మరసం, కొంచెం రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
కమలా పండు తొక్కులను ఎండలో ఎండబెట్టి అనంతరం దీనిని పౌడర్‌గా చేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా పెరుగు, ముల్తాని మట్టీ, చందనం పొడులను, నీళ్లను పోసి బాగా పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత నీటితో కడుక్కుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన చర్మం అందంగా మెరుస్తుంది.