శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (18:36 IST)

దాల్చిన చెక్క పొడితో మొటిమలకు చెక్!

దాల్చిన చెక్క పొడితో మొటిమలను దూరం చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క పొడిని తీసుకుని అందులో సరిపడా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. మొటిమలు, నల్లమచ్చలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. అవి పూర్తిగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరి. ఇలా క్రమంగా చేయడం వల్ల నల్లమచ్చలు తగ్గుముఖం పడుతాయి.
 
నిమ్మరసం ఉపయోగించడం ఇబ్బంది అనుకుంటే, దానికి బదులుగా తేనెను కూడా ఉపయోగించవచ్చు. చెంచా దాల్చిన చెక్క పొడికి మూడు చెంచాలా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు, మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకోవాలి. 
 
అలా రాంత్రంతా ఉంచి పొద్దున్న లేవగానే శుభ్రం చేసుకోవచ్చు. ఒక వేళ అలా ఇబ్బంది అనుకున్న వారు అప్లై చేసుకున్న 20నిముషాల తర్వాత శుభ్రం చేసేసుకోవచ్చు. ఈ విధంగా వారానికోసారి చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.