శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 31 జులై 2014 (15:33 IST)

సీజన్‌లోనే కాదు.. నిత్యం సౌందర్యంగా ఉండాలంటే..?

ప్రతి ఋతువు చర్మంపై ప్రభావం చూపిస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో ఏమేమి చేయాలో తెలుసుకోవాలి. దీనికి నిత్యం చర్మ సౌందర్యం పెంపొందించుకునేందుకు ఇలా చేయండి. 
 
* కీరకాయ, టమోటా మరియు క్యారెట్టు రసాలను సమపాళ్ళలో కలుపుకుని 15 నుంచి 20 రోజుల వరకు ముఖానికి పూయండి. దీంతో మీ ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది. 
 
* పుదీనా రసాన్ని నియమానుసారం ముఖానికి అప్లై చేస్తుంటే ముఖంపైనున్న మచ్చలు తొలగిపోతాయి.  
 
* పచ్చి బంగాళాదుంప రసాన్ని శరీర చర్మంపై క్రమం తప్పకుండా మాలిష్ చేస్తుంటే చర్మంపై ముడతలు ఏర్పడవంటున్నారు ఆరోగ్యనిపుణులు. 
 
* అరటిపండును గుజ్జుగా చేసుకోండి. ఇందులో కాసింత తేనె, రెండు చుక్కలు గ్లిజరిన్ కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది.