శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 18 మే 2015 (19:01 IST)

గుర్తించని హార్మోన్ల ప్రభావం వల్ల బరువు పెరిగే మహిళలు.. ఇలా చేస్తే..?

గుర్తించని హార్మోన్ల ప్రభావం వల్ల కూడా మహిళలు బరువు పెరుగుతారట. అలాగే బహిష్టులు ఆగి ఆగి వస్తుంటే శరీరం బరువు పెరుగుతుంది. ఒళ్ళు పెరిగితే బరువు మాత్రమే, కాదు ఆకృతి కూడా వికారంగా తయారవుతుంది. అయిదు తులాల నీరుల్లి పాయల్ని ముక్కలు చేసి ఒక లీటరు నీళ్ళల్లో కాచి మూడవంతు నీరు మిగులునట్లు కాచి వడపోసుకుని అందులో బెల్లం కలుపుకుని మూడు వారాల తాగితే బహిష్టు సక్రమమై శరీరం చక్కగా వుంటుంది.
 
అలాగే  వయస్సు పెరగడం సహజం. దాంతో శరీరపు సౌందర్యం పెరగాలి, కానీ సడలకూడదు. ఇంకా మహిళల శరీరపు ఛాయ తరగకుండా ఆకర్షణీయంగా వుండాలంటే పసుపు, ఆవాలు, కుంకుమపువ్వు, శొంఠి, కొంచెం కర్పూరం కలిపి పెసరపిండిలో కలుపుకుని స్నానానికి ముందు నలుగు పెట్టుకుంటే నలుపు విరిగి తెల్లబడతారు.