శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By preeti
Last Modified: బుధవారం, 3 మే 2017 (15:41 IST)

నవయవ్వనంగా ఉండాలంటే...

చర్మం ముడతలు పడటం మొదలైందంటే వృద్ధాప్యం దరి చేరుతున్నట్లు అర్థం. సాధారణంగా వయస్సు పెరుగుదలతో చర్మం ముడతలు పడటం అనేది శారీరక ప్రక్రియ, కానీ రేడియేషన్, పొగ, పోషకాహార లోపం, డీహైడ్రేషన్, కాలుష్యం వంటి వివిధ కారణాల చేత చర్మం త్వరగా ముడతలు పడవచ్చు. ఇంట్లో

చర్మం ముడతలు పడటం మొదలైందంటే వృద్ధాప్యం దరి చేరుతున్నట్లు అర్థం. సాధారణంగా వయస్సు పెరుగుదలతో చర్మం ముడతలు పడటం అనేది శారీరక ప్రక్రియ, కానీ రేడియేషన్, పొగ, పోషకాహార లోపం, డీహైడ్రేషన్, కాలుష్యం వంటి వివిధ కారణాల చేత చర్మం త్వరగా ముడతలు పడవచ్చు. ఇంట్లో పాటించగల కొన్ని సహజ చిట్కాలతో నిగనిగలాడే చర్మాన్ని పొందవచ్చు మరియు వృద్ధాప్య ఛాయలు త్వరగా అలుముకోకుండా నివారించవచ్చు. 
 
కలబంద గుజ్జును ముఖానికి రాసుకుని, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. కప్పు పెరుగులో గోరంత పసుపు కలిపి ముఖానికి మరియు మెడకు పట్టించండి, ఇది మీ చర్మాన్ని మృదువుగా చేసి, ముడతలు రాకుండా నివారిస్తుంది. కొబ్బరి నూనె లేదా బాదం నూనె తీసుకుని ముఖంపై వలయాకారంలో మునివేళ్లతో 15 నిమిషాల పాటు మర్దన చేయండి. 
 
ఈ చిట్కాలతో పాటుగా ఒత్తిడిని అధిగమించడం, 8 గంటలు నిద్రపోవడం, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అవలంబించడం, ప్రతిరోజూ ఉదయం యోగా మరియు వ్యాయామం చేయడం, ధూమపానం లాంటి అలవాట్లను మానుకోవడం, అలాగే పండ్లు మరియు కూరగాయలను తినడం వంటి జాగ్రత్తలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.