శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (18:13 IST)

కోడిగుడ్డులోని తెల్లని సొనను ముఖానికి పట్టిస్తే?

కోడిగుడ్డులోని తెల్లని సొనను ముఖానికి పట్టించడం ద్వారా వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. తెల్లసొన‌లో ఉండే పోష‌కాల వ‌ల్ల శ‌రీరంపై ముడ‌త‌లు తొలగిపోతాయి. అలాగే ముఖ‌ వ‌ర్చ‌స్సు పెరుగుతంది. అలాగే టేబుల్ స్పూన్ ర

కోడిగుడ్డులోని తెల్లని సొనను ముఖానికి పట్టించడం ద్వారా వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి. తెల్లసొన‌లో ఉండే పోష‌కాల వ‌ల్ల శ‌రీరంపై ముడ‌త‌లు తొలగిపోతాయి. అలాగే ముఖ‌ వ‌ర్చ‌స్సు పెరుగుతంది. అలాగే టేబుల్ స్పూన్ రోజ్ వాట‌ర్‌లో త‌గిన మోతాదు మేర గ్లిజ‌రిన్‌ను కలపాలి. ఈ పేస్టును ముఖానికి రాస్తే మొటిమలు దూరమవుతాయి. 
 
అలాగే నిమ్మరసం, గులాబీ నీటిని చేర్చి.. అందులో స్పూన్ గ్లిజ‌రిన్‌ని క‌లుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం మెరిసిపోతుంది. కొబ్బ‌రి నూనె శ‌రీరానికి రాసుకోవడం వ‌ల్ల ముడ‌త‌లు పోయి.. శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌సర‌ణ బాగా జ‌రుగుతుంది.
 
ఇంకా కొద్దిగా పచ్చి పాలు దానిలో ఒక స్పూన్ సెనగపిండి కలిపి ముఖానికి రాయాలి. పది నిమిషాల తర్వాత కడిగేయాలి. తర్వాత టమోటా జ్యూస్‌ను ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత కడిగేస్తే చర్మం కొత్త రంగును సంతరించుకుంటుంది. పైగా అలసట నీరసం తొలగిపోయి.. చర్మం చాలా అందంగా తయారవుతుందని బ్యూటీషియన్లు అంటున్నారు.