శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (16:43 IST)

చందనంతో నిత్యయవ్వనులుగా ఉండండి!

చందనం నిత్యయవ్వనులుగా ఉంచుతుంది. చందనంతో చర్మంపై ముడతలకు చెక్ పెట్టవచ్చు. తద్వారా చర్మానికి గ్లోనిస్తుంది. సన్ టానింగ్ వల్ల చర్మం తర్వాత నల్లగా మారడం వయస్సు మీదపడుతున్నట్లు అనిపిస్తే చందనం సౌందర్య సాధనంగా పనిచేస్తుంది.
 
ఈ సమస్యలను నివారించడానికి చందనం, తేనె, నిమ్మరసం, పెరుగు మిశ్రమంతో మిక్స్ చేసి ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంతో పాటు టానింగ్ ఎఫెక్ట్‌ను నివారిస్తుంది.
 
చర్మం మీద ఎటువంటి వృద్ధాప్య లక్షణాలు కనబడినయకుండా చేయాలంటే, గుడ్డు సొనలో తేనె, చందనం మరియు ఆలివ్ ఆయిల్‌ను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి తర్వాత శుభ్రం చేసుకోవాలి. 
 
శాండిల్ వుడ్ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల చర్మం సాఫ్ట్‌గా మారుతుంది.ఆయిల్ మసాజ్ చేసిన రెండు గంటల తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణులు అంటున్నారు.